Sunday, April 28, 2024

ట్విట్టర్‌లో 50 శాతం ఉద్యోగులపై వేటు

- Advertisement -
- Advertisement -

50 percent employees layoffs at Twitter

శాన్ ఫ్రాన్సిస్‌కో : ఎలన్ మస్క్ ఆపరేషన్ ట్విట్టర్‌కు దిగారు. సంస్థకు చెందిన ఉద్యోగులలో దాదాపు సగం మందిని తీసివేశారు. భారీ ధరకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ప్రపంచ అత్యంత సంపన్నుడు మస్క్ ఇది సంక్షుభిత కంపెనీ అని, దీనిని పూర్తి స్థాయిలో ప్రక్షాళించాల్సి ఉందని తెలిపారు. ఇందులో భాగంగా వేరే దారిలేకపోవడం వల్లనే 50 శాతం సిబ్బందిపై వేటు వేశారని ప్రకటనలేకుండానే తెలిపారు. ఇప్పటికే ఉన్నతస్థాయి ఉద్యోగులపై వేటేసిన మస్క్ ఇప్పుడు పలు స్థాయిలలోని ఉద్యోగులను ఇక జాబ్‌కు రావద్దు, ఇంటికి వెళ్లండని పంపించారు. ట్విట్టర్‌లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసివేస్తున్న అంశంపై ఇప్పుడు అంతర్గత సమాచారం పంపిణీ అవుతోంది. దీనిని కొన్ని వార్తాసంస్థలు బయటకు తీసుకువచ్చాయి. దాదాపు 50 శాతం మంది ట్విట్టర్ ఉద్యోగాలు కోల్పోతున్నారని, వారి కంపెనీ కంప్యూటర్ల అనుసంధానం, ఇ మొయిల్ ఉద్యోగ ప్రక్రియలు అన్ని తెగిపొయ్యాయని వార్తా సంస్థ ఎఎఫ్‌పి వార్తాసంస్థ తెలిపింది.

తక్షణ రీతిలోనే వీరిని ఉద్యోగాల నుంచి తీసివేసినట్లు తెలిపారు. భారతదేశం ఇతర చోట్ల ఉన్న ట్విట్టర్ ఉద్యోగులు ఇంతకాలం దీనితో అత్యంత అనుబంధం పెంచుకుని వస్తున్న వారు ఇప్పుడు ఇంటికి వెళ్లవచ్చుననే మస్క్ ఆదేశాలతో కంగుతిన్నారు. ఏదో మార్పు జరుగుతుందని తాము భావించామని అయితే ఈ విధంగా తమను ఇంతత్వరగా తీసివేస్తారని తాము భావించలేదని పలువురు ఉద్యోగులు తెలిపారు. కొందరు తమ ఆవేదనను గుడ్‌బైను ట్విట్టర్‌లోనే చివరి సందేశంగా వెలువరించారు. ట్విట్టర్‌తో పని అయిపోయిందనే మెస్సెజ్‌లతో తమకు తెల్లారిందని , ఈ విధంగా ఇక పనికి వీల్లేదని చెప్పడం దారుణం అని దీనితో తాను ఆవేదనకు గురయ్యానని మైకెల్ ఆస్టిన్ స్పందించారు. మైకెల్ ట్విట్టర్‌లో పబ్లిక్ పాలసీ వ్యవహారాల అమెరికా కెనడా డైరెక్టర్‌గా ఉన్నారు.

అయితే ఉద్యోగుల తగ్గింపు నిర్ణయం తప్పనిసరి అయిందని మస్క్ తెలిపారు. రోజుకు 4 మిలియన్ డాలర్లను నష్టపోతున్న దశలో కంపెనీని తీసుకున్నామని, అన్ని పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. లేఆఫ్‌లు తప్పడం లేదని వేరే మార్గ ం లేదని ఉద్యోగాల తీసివేతలపై విమర్శల నేపథ్యంలో మస్క్ జవాబు ఇచ్చుకున్నారు. అయితే తమను ఉన్నట్లుండి తీసివేయడం అత్యంత అమానుషం అని , క్రూరంగా వ్యవహరించాలనుకుంటున్నట్లుంది. ఏదో విధంగా డబ్బులు ఆదా చేయాలనుకుంటున్నట్లుగా ఉందని, భారీ స్థాయిలో డీల్‌కుదుర్చుకుని ట్విట్టర్ కొనుగోళ్లు చేసిన తరువాత ఇప్పుడు సిబ్బందిని తీసివేస్తూ పోతే ఎట్లా అని పదవిపోయిన ఓ ఉద్యోగి స్పందించారు. ఓ వైపు ట్విట్టర్‌లో భారీగా ఉద్యోగాల కోత దశ ఉండగానే మరో వైపు ఈ కంపెనీకి యాడ్స్ ఇవ్వరాదనే పిలుపులు వెలువడుతున్నాయి. పైగా బిలియనీరు మస్క్‌కు అత్యంత ప్రజాదరణ పొందిన ట్విట్టర్ నిర్వహణ సామర్థం ఏ స్థాయిలోనూ లేదని, ఇటువంటి వేదికల నిర్వహణకు మనసు ముఖ్యం అని అమెరికాలోని పలు పాలసీ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News