Monday, April 29, 2024

63 లక్షలు దాటిన కరోనా టెస్టులు

- Advertisement -
- Advertisement -

509 New Covid-19 Cases Reported in Telangana

కొత్తగా మరో 509 పాజిటివ్‌లు, ముగ్గురు మృతి
జిహెచ్‌ఎంసి పరిధిలో 104, జిల్లాల్లో 405 మందికి వైరస్
2,79,644 కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 63 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల ఆరు వేల 397 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ నివేదించింది. అంటే ప్రతి పది లక్షల మందిలో లక్షా 69 వేల 435 మందికి టెస్టులు చేసినట్లు వైద్యశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా బుధవారం 48,652 మందికి టెస్టులు చేయగా మరో 509 మందికి పాజిటివ్‌లు తేలాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 104 ఉండగా ఆదిలాబాద్‌లో 6, భద్రాద్రి 14, జగిత్యాల 13, జనగాం 5, భూపాలపల్లి 6, గద్వాల 4, కామారెడ్డి 4, కరీంనగర్ 15,ఖమ్మం 25, ఆసిఫాబాద్ 6, మహబూబ్‌నగర్ 10, మహబూబాబాద్ 11, మంచిర్యాల 12, మెదక్ 6, మేడ్చల్ మల్కాజ్‌గిరి 45, ములుగు 10, నాగర్‌కర్నూల్ 11, నల్గొండ 13, నారాయణపేట్ 2, నిర్మల్ 5, నిజామాబాద్ 11, పెద్దపల్లి 13, సిరిసిల్లా 10, రంగారెడ్డి 42, సంగారెడ్డి 18, సిద్ధిపేట్ 19, సూర్యాపేట్ 15, వికారాబాద్ 5, వనపర్తి 7, వరంగల్ రూరల్ 8, వరంగల్ అర్బన్ లో 27, యాదాద్రిలో మరో 9 మందికి వైరస్ సోకింది.

అదే విధంగా వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,79,644కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,70,967కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు. అయితే మరో రెండు నెలల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ముఖ్యంగా హైరిస్క్ గ్రూప్ ప్రజలు వీలైనంత వరకు జనసమ్మర్ధ ప్రదేశాల్లో తిరగకుంటే మేలని ఆయన సూచించారు. అత్యవసరమైతే మాస్కు, భౌతిక దూరం వంటివి పాటించాలని ఆయన అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News