Wednesday, May 15, 2024

యాదాద్రి ఆలయ గోపురానికి 6 కేజీల బంగారం తాపడం: మేఘా సంస్థ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ విమాన గోపురం బంగారం తాపడానికి 6 కేజీల బంగారం బహుకరించనున్న ఎంఇఐఎల్

6 kg gold plating for Yadadri temple

హైదరాబాద్: తెలంగాణలోని ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పిలుపు మేరకు ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ లిమిటెడ్ ఆరు కేజీల బంగారం సమర్పిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది.

ఈ సందర్భంగా ఎంఇఐఎల్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ గోపురానికి బంగారు తాపడం ఎంతో పుణ్య కార్యక్రమమని, ఇందులో తాము పాలుపంచుకోవడం మాకు ఎంతో గౌరవప్రదమైన అవకాశమని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేస్తామని అన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన, పుణ్యస్థలమైన యాదాద్రి కెసిఆర్ ఆలోచనాత్మక రూపకల్పనలో మరింత అందంగా రూపుదిద్దుకుని, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రిష్ణా జిల్లాలోని డోకిపర్రు గ్రామంలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంఇఐఎల్ నిర్మించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని దర్శనీయ పుణ్య క్షేత్రాల్లో ఒకటి ప్రఖ్యాతి పొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News