Monday, May 6, 2024

బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -
65-year-old man attempts to rape minor girl
మూసాపేటలో ఘటన, నిందితుడిపై పోక్సో కేసు నమోదు

హైదరాబాద్: మనవరాలి వయస్సు ఉన్న చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు ఓ వృద్ధుడు. చిన్నారిని దగ్గరకు తీసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని మూసాపేటకు చెందిన గౌస్(65) తన ఇంటి ఆవరణలో బాలిక(8) ఆడుకుంటోంది. బాలికకు మాయమాటలు చెప్పిన వృద్ధుడు బాలికను ఇంట్లోకి తీసుకుని వెళ్లాడు. అక్కడ బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించాడంతో చిన్నారి ఏడుస్తూ కేకలు పెట్టింది. దీంతో ఇంట్లో నుంచి బయటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు ఆరా తీశారు. జరిగిన సంఘటన గురించి బాలిక వారికి చెప్పింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News