Saturday, April 27, 2024

కరోనా చికిత్సకు వైద్యుల వెనకడుగు..

- Advertisement -
- Advertisement -

gandhi hospital

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ సాధారణ ప్రజలను పీడిస్తూ ఆసుపత్రులబాట పట్టేలా చేస్తుంది. గత మూడు నెలలు నుంచి విజృంభిస్తూ అమాయకులు ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటివరకు నగరంలో 2,138 పాజిటివ్ కేసులు నమోదుకాగా గత వారం రోజుల నుంచి వైద్యులను కూడా వదలడం లేదు కరోనా. ఇప్పటి వరకు 68 మంది వైద్యులకు పాజిటివ్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. రోజు రోజుకు కరోనా బారినపడుతున్న వైద్యుల సంఖ్య పెరిగిపోతోంది.

నేటివరకు ఉస్మానియాలో 41 మంది డాక్టర్లుకు, అదేవిధంగా గాంధీ ఆసుపత్రిల్లో నలుగురు, నిమ్స్‌లో 12 మంది డాక్టర్లు కరోనా బారినపడ్డారు. నిమ్స్‌లో 12మంది డాక్టర్లు, 8 మంది పారామెడికల్ స్టాఫ్‌కు సోకింది. వారితోపాటు ముగ్గురు డెంటల్ విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాంతో వైద్యులు రోగులకు చికిత్స అందించాలంటే వైద్యులు వెనకడుగు వేస్తున్నారు. అదనంగా విధులు నిర్వహిస్తుండటంతో వైరస్‌ బారినపడుతున్నట్లు పలువురు డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

68 Healthcare workers test positive for Corona in TS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News