Monday, April 29, 2024

మార్కెట్లోకి 6జిబి వేరియంట్ వివో వై51ఎ

- Advertisement -
- Advertisement -

6GB variant Vivo Y51A launched in market

 

న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో తాజాగా 6జిబి వేరియంట్ వివో వై 51ఎను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.16,990, రెండు రంగులలో అందుబాటులో ఉంది. 5000 ఎంఎహెచ్ బ్యాటరీ, 18డబ్లు ఫాస్ట్ చార్జ్, రివర్స్ చార్జింగ్ ఫీచర్ కల్గివుంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజ్ వేరియంట్ (1టిబి వరకు విస్తరించవచ్చు) ధర రూ.16,990గా ఉంది.

స్పెసిఫికేషన్లు

వివో వై 51ఏ లో క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 662 ఎస్​ఓసీ, 5,000 ఎంఏహెచ్​​ బ్యాటరీ, సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ ప్రింట్​ స్కానర్​, ట్రిపుల్​ రియర్​ కెమెరా సెటప్​​ వంటివి అందించారు. 6.5 అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి ప్యానల్‌, 1,080 x 2,408 పిక్సెల్‌ల రిజల్యూషన్‌, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్​ను మరింత పెంచుకోవచ్చు. 18W ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్​తో కూడిన 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. 48MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కెమెరా, 2MP మాక్రో లెన్స్ కెమెరా వంటివి వాటితో ఫోటో క్లారిటీ అదిరిపోతుందని కంపెనీ చెబుతుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్​ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News