Sunday, April 28, 2024

సిక్కిం వరదల్లో గల్లంతైన 77 మంది కుటుంబాలకి ప్రభుత్వ సహాయం

- Advertisement -
- Advertisement -

గ్యాంగ్‌టక్ : గత అక్టోబర్‌లో సిక్కింలో సంభవించిన వరదల్లో గల్లంతై , ఇంతవరకు ఆచూకీ లేని 77 మంది చనిపోయి ఉండవచ్చని చీఫ్ సెక్రటరీ విబి పాథక్ అనుమానం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో చెల్లించడంతోపాటు అనేక విధాల ప్రయోజనాలతో సాయం అందించడమౌతుందని ఆయన వివరించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఎలాంటి విధానాలు అవలంబించారో, అదే విధమైన పద్ధతులను అనుసరిస్తామన్నారు.

అక్టోబర్ 4న సిక్కిం వరదల్లో మొత్తం 77 మంది ఆచూకీ లేకుండా గల్లంతయ్యారు. తరువాత రెండు మృతదేహాలు లభ్యమైనా వారి కుటుంబాలు నిర్ధారించలేదు. ఈ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా వంతున చెల్లించనుండగా, కేంద్ర ప్రభుత్వం ప్రధాని సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల వంతున సాయం అందిస్తుంది. తప్పిపోయిన వారి కేసులు జనవరి నాటికి పరిష్కారమవుతాయని చీఫ్ సెక్రటరీ తెలిపారు. అయితే మొదట గల్లంతైనట్టు ఆయా కుటుంబాలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు దాఖలు చేస్తే అవన్నీ పరిశీలించడమవుతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News