Monday, April 29, 2024

8 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు న్యాక్ గుర్తింపు

- Advertisement -
- Advertisement -

8 Government Degree Colleges are recognized by NAAC

ఏడింటికి ఎ, బేగంపేట మహిళా డిగ్రీ కాలేజీకి ఎ ప్లస్
19కి చేరిన న్యాక్ ఎ ప్లస్ అటానమస్ కాలేజీలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎనిమిది ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు న్యాక్ గుర్తింపు లభించింది. అందులో 7 కాలేజీలు న్యాక్ ఎ గుర్తింపు పొందగా, బేగంపేటలోని మహిళా డిగ్రీ కళాశాలకు మాత్రం న్యాక్ ఎ ప్లస్ గుర్తింపు లభించింది. న్యాక్ ఎ గుర్తింపు పొందిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నల్గొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, విద్యానగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, బిచ్చుకొండ భుత్వ డిగ్రీ కాలేజీ, కామరెడ్డి భుత్వ డిగ్రీ కాలేజీ, సత్తుపల్లి భుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 19 అటానమస్ కాలేజీలు ఎ ప్లస్ గుర్తింపు పొందినట్లు రాష్ట్ర కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు.

న్యాక్‌పై సర్కారు దృష్టి

రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు న్యాక్ గుర్తింపు ప్రభుత్వ చర్యలు తీసుకుంటుంది. అన్ని కాలేజీలు న్యాక్ గుర్తింపు దక్కించుకొనేలా ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నది. కనీసం తాత్కాలిక గుర్తింపునైనా సాధించాలని సహకరిస్తున్నది. న్యాక్ గుర్తింపు కోసం సన్నద్ధమయ్యేందుకు కాలేజీలకు ఉన్నత విద్యామండలి ఆర్థిక సహకారం కూడా అందిస్తోంది. సెల్ఫ్ స్టడీ రిపోర్టుల తయారీకి వర్సిటీలకు రూ.2 లక్షలు, కాలేజీలకు రూ.1 లక్ష వరకు అధికారులు గ్రాంట్‌గా ఇస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 130 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండగా, అందులో 85 కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందాయి. మరో ఐదు కాలేజీలు న్యాక్ గుర్తింపు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా, త్వరలో ఈ కాలేజీలకు కూడా న్యాక్ గుర్తింపు లభించే అవకాశం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News