Saturday, April 27, 2024

వయసు 99.. కూడగట్టింది రూ.100కోట్లు

- Advertisement -
- Advertisement -

 

కరోనాపై యుద్ధానికి బ్రిటన్‌లో ఓ వృద్ధుడి సంకల్పానికి అనూహ్య మద్దతు
లండన్: బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన 99 ఏండ్ల రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ టామ్ మూర్ (99) కరోనా బాధితుల వైద్యం కోసం ఊహించని రీతిలో విరాళాలు పోగు చేశారు. తద్వారా గట్టి సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించారు. మూర్‌కు రెండేండ్ల క్రితమే తుంటి ఎముక విరిగిపోయింది. ఊతకర్ర సాయంతో మాత్రమే నడువగలరు. అది కూడా పది పదిహేను అగుడు దూరం మాత్రమే. కానీ ఆయన తన నివాసం చుట్టూ 25 మీటర్ల దూరం ఏర్పరచుకున్న గార్డెన్‌లో 100 సార్లు నడవాలని నిశ్చయించుకున్నారు. ఏప్రిల్ నెలలోనే 100వ జన్మదినం జరుపుకోనున్న టామ్ మూర్ పుట్టిన రోజు నాటికి 100 రౌండ్లు తిరుగుతానని చాలెంజ్ చేశారు. నా సవాల్‌కు స్పందించి కరోనా బాధితుల కోసం తోచినంత విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆ విరాళాలను ఎన్‌హెచ్‌ఎస్‌కు అందిస్తానని చెప్పారు. ఆయన లక్షానికి పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. మూర్ చేస్తున్న పనికి ముగ్దులై లక్షల మంది విరాళాలు అందజేశారు. ఇప్పటివరకు మూర్‌కు 12 మిలియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో రూ.100కోట్ల పైనే విరాళాలు సమకూరాయి. మూర్‌కు ప్రమాదం జరిగినప్పుడు ఎన్‌హెచ్‌ఎస్ ఆయనకు ఎంతో సేవ చేసింది. ఆ సంస్థ చేసిన సేవలకు కృతజ్ఞతగా ఎన్‌హెచ్‌ఎస్‌కు ఏదో విధంగా సహాయపడాలనుకున్నారని మూర్ అల్లుడు కొలిన్ ఇన్‌గ్రామ్ తెలిపారు. మూర్ ఇప్పుడు బ్రిటన్‌లో సెలెబ్రిటీగా మారిపోయారు.

 

99 year old Britain retired army Captain get rs 10 cr fund

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News