Thursday, May 9, 2024

152వ చిత్రం 99 రోజుల్లోనే!

- Advertisement -
- Advertisement -

chiranjeevi

 

‘సైరా’ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. ‘సైరా’ ఆలస్యం అయిన కారణంగా తదుపరి చిత్రాన్ని కాస్త త్వరగా పూర్తి చేయాలని చిరంజీవి దర్శకుడు కొరటాల శివను కోరడం జరిగిందట. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చిరంజీవి తన 152వ చిత్రం గురించి ఓ కీలక ప్రకటన చేశారు. “సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని కేవలం నాలుగు, అయిదు నెలల్లో పూర్తి చేయడమనేది చాలా గొప్ప విషయం.

ఇలా చేయడం వల్ల నిర్మాతలకు వృధా ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. బయ్యర్లు, నిర్మాతలు అంతా కూడా లాభం పొందుతారు. అందుకే సినిమాలను తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. నా 152వ చిత్రాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని కొరటాలకు చెప్పిన సమయంలో ఆయన 100 రోజుల లోపే పూర్తి చేస్తానంటూ హామీ ఇచ్చాడు”అని అన్నారు.

అంతేకాకుండా కొరటాల శివను తన వద్దకు పిలుచుకొని “వంద రోజులకు ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా మన సినిమాను పూర్తి చేయాలి” అంటూ చిరంజీవి సున్నితంగా నవ్వుకుంటూ వార్నింగ్‌లా ఇచ్చారు. అందుకు కొరటాల శివ స్పందిస్తూ “99 రోజుల్లో తప్పకుండా పూర్తి చేస్తాను”అని హామీ ఇచ్చారు. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఈ ఏడాది వేసవి చివరి వరకు సిద్ధమయ్యే అవకాశం ఉంది. అది కాదంటే దసరా వరకు ఈ మెగా మూవీ తప్పకుండా వస్తుంది. ఇక అతి త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

152nd movie in 99 days
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News