Thursday, May 16, 2024

కరోనాపై ‘జన ఆందోళన’కు కేంద్రం శ్రీకారం

- Advertisement -
- Advertisement -

కరోనాపై జన ఆందోళనకు కేంద్రం శ్రీకారం
సమైక్య పోరాటానికి ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి కోసం జరుపుతున్న పోరాటంలో భాగంఆ ఒక ప్రజా చైతన్య ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం గురువారం శ్రీకారం చుట్టింది. కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు ఫేస్ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు గురువారం ప్రజలకు పిలుపునిచ్చారు. రానున్న పండుగల మాసం, శీతాకాలం, ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభం తదితర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని జన ఆందోళన ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ప్రజలు చైతన్యవంతులై కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. వైరస్‌పై పోరాటంలో ప్రజలందరూ ఐక్యం కావాలని ఆయన కోరారు. యునైట్‌టుఫైట్‌కరోనా అనే హ్యాష్ ట్యాగ్‌తో ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ ఈ పోరాటాన్ని కొనసాగించి మన ప్రజలను వైరస్ నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం, రెండు అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం వంటి చర్యల ద్వారా కరోనాపై పోరాటంలో మనమందరం విజయం సాధించగలమంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ను అంతం చేయాలంటే ప్రజలందరూ కలసికట్టుగా పోరాడాల్సి ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు.

PM Modi calls for Fight on Coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News