Tuesday, May 28, 2024

ఫేస్‌బుక్‌తో బుక్కయ్యాడు

- Advertisement -
- Advertisement -

Young Woman who cheated on Young man with nude video call

 

మనతెలంగాణ, హైదరాబాద్ : ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను అంగీకరించిన బాధితుడిని నిండాముంచింది ఓ యువతి. దుస్తులు లేకుండా వీడియో కాల్ మాట్లాడి అడ్డంగా బుక్కయ్యాడు. వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మేయిల్ చేసి డబ్బులు వసూలు చేసింది. పోలీసుల కథనం ప్రకారం… నగరానికి చెందిన యువకుడికి రాజస్థాన్‌కు చెందిన యువతి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ పంపించింది. దీనిని అంగీకరించిన యువకుడికి యువతి వాట్సాప్ నంబర్ పంపించింది. దీంతో ఇద్దరు తరచూ మాట్లాడుకునే వారు. ఈ క్రమంలోనే యువతి వాట్సాప్ వీడియో కాల్ చేసి దుస్తులు తొలగించింది. యువకుడిని కూడా దుస్తులు తొలగించి మాట్లాడాల్సిందిగా కోరింది. యువతి చెప్పినట్లు చేయడంతో వీడియోను రికార్డు చేసింది. తర్వాత దానిని పంపించి బ్లాక్‌మేయిల్ చేయడం ప్రారంభించింది. తనకు డబ్బులు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్‌మేయిల్ చేయడంతో దశల వారీగా రూ.2లక్షలు ఇచ్చాడు. అయినా కూడా మళ్లీ డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తుండడంతో భరించలేక యువకుడు నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News