- Advertisement -
పెద్దఅంబర్‌పేట్: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ వద్ద కారులో గంజాయి లభ్యమైంది. కారు ఇంజన్ లో కొందరూ గంజాయినీ తరలిస్తుండగా మంటలు అంటుకున్నాయి. దీంతో కారులోని వ్యక్తులు కారును వదిలి అక్కడి నుంచి పారిపోయారు. గమనించిన స్థానికులు అక్కడికి వెళ్లి మంటలను ఆర్పివేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంజాయి రవాణ చేస్తున్న వారికోసం ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న స్విఫ్ట్ కారులో (టిఎస్ 08 హెచ్‌జె2026)గంజాయి తరలిస్తున్నారని అధికారులు తెలిపారు.
- Advertisement -