Sunday, May 12, 2024

ఇటలీ నుంచి వస్తున్న ‘థ్యాంక్యూ’

- Advertisement -
- Advertisement -

Thankyou movie Italy schedule filming is complete

 

హీరో అక్కినేని నాగచైతన్య, డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘థాంక్యూ’. ఇందులో చైతూ సరసన బబ్లీ బ్యూటీ రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగులు నిలిపేస్తున్న సమయంలో ‘థాంక్యూ’ చిత్ర బృందం తదుపరి షెడ్యూల్ కోసం ఇటలీ వెళ్ళింది. అయితే ‘థ్యాంక్యూ’ ఇటలీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ షెడ్యుల్‌లో నాగ చైతన్య – రాశీఖన్నా పాల్గొన్న కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిసింది. ‘థాంక్యూ’ మూవీ ఇటలీ షెడ్యూల్ పూర్తయ్యిందని చెబుతూ.. చిత్ర బృందం కలిసి దిగిన ఓ ఫోటోని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు షూటింగ్ లొకేషన్‌లో నాగ చైతన్య – రాశిఖన్నా కలిసి దిగిన ఓ సెల్ఫీ ఫొటోను రాశి సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డిలు కలిసి నిర్మిస్తున్నారు. బీవీఎస్ రవి ఈ సినిమాకి స్టోరీ అందించడంతో పాటు డైలాగ్స్ రాస్తున్నారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. ఎస్‌ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News