Friday, May 17, 2024

వేయిస్తంభాల గుడిలో వినాయకుడికి పూజలు: ఎర్రబెల్లి

- Advertisement -
Vinayaka pooja in thousand pillar temple
హన్మకొండ: వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించి పూజలు నిర్వహించామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి వినాయక చవితి పండుగ సందర్భంగా వేయి స్తంభాల గుడి లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించి వినాయకునికి పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎర్రబెల్లి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  వినాయక చవితి పండుగ సందర్భంగా చారిత్రాత్మక వేయిస్తంభాల గుడి లో వినాయకునికి పూజలు నిర్వహించారు.
ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని, తెలంగాణ ప్రజలు సుఖ, సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నానని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ కృషితో రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా యూనిస్కో గుర్తిందన్నారు.  వేయి స్తంభాల గుడిని ఆధ్యాత్మికంగా వెలుగొందే విధంగా అభివృద్ది చేస్తున్నామని, కెసిఆర్ ఆలోచనలతో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందని, ఏడేండ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని,  అందరూ ఇంట్లోనే మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News