Monday, April 29, 2024

పెండింగ్ చల్లానకు విశేష స్పందన

- Advertisement -
- Advertisement -

ఇప్పటి వరకు రూ. 66.77 కోట్లు వసూలు
ఈ నెల 10వ తేదీతో ముగియనున్న గడువు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన లభిస్తుంది. ట్రాఫిక్ చల్లాన చెల్లింపుకు ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ఇచ్చిన నేపథ్యంతో వాహనదారులు చల్లాను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 5వ తేదీ వరకు 76.79 లక్షలకు సంబంధించి రూ. 66.77 కోట్లు వసూలైనట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో రూ. 18 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్‌లో రూ. 14 కోట్లు, రాచకొండ కమిషనరేట్‌లో రూ. 7.15 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా ఈ నెల 10వ తేదీ వరకు రాయితీతో చలాన్లు చెల్లింపునకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు రాయితీ గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. మరోపక్క సైబర్ నేరస్థులు నకిలీ వెబ్‌సైట్‌తో వాహనదారులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, చలానాల చెల్లింపులో ఎలాంటి సందేహాలు ఎదురైనా 040-27852721, 8712661690 (వాట్సాప్) నంబర్లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్, నెట్‌బ్యాకింగ్ ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. బైక్‌లు, ఆటోలకు 80 శాతం, ఫోర్ వీలర్లకు 60 శాతం, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90 శాతం, భారీ వాహనాలపై 50 శాతం రాయితీని ప్రకటించారు. రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్‌లో ఉండటంతో పోలీసుశాఖ ఈ నిర్ణయం తీసుకొన్నది. గతేడాది రాయితీ ప్రకటనతో 45 రోజుల్లోనే ఏకంగా రూ.300 కోట్ల ఆదాయం సమకూరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News