Monday, April 29, 2024

పినపాకలో విప్ రేగా విస్తృత పర్యటన

- Advertisement -
- Advertisement -

పినపాక : పినపాక మండలంలోని దుగినేపల్లి, అమరారం, పాండురంగాపురం గ్రామ పంచాయితీ పరిధిలోని పలు గ్రామాలలో వివిధ కారణాలతో అనారోగ్య కారణంగా బాధపడుతున్న పలు కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పర్యటించి బాధిత కుటుంబాల యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని, అనంతరం వారికి భరోసా కల్పించారు….ఈ పరామర్శలో భాగంగా పాండురంగాపురం గ్రామ పంచాయితీలోని బిఆర్‌ఎస్ పార్టీ మండల యువజన విభాగం ఉపాధ్యక్షులు యాటగిరి చెన్నకేశవులు తండ్రి ఆంజనేయులు ఇటీవల కొన్ని రోజుల క్రితం మరణించడంతో వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు.

అదే విధంగా దుగినేపల్లి గ్రామ పంచాయితీలోని స్ధానిక ఎంపిటిసి ఎగ్గడి ఉమాదేవి, సత్యనారాయణ దంపతుల కుమారుడు సాయికిరణ్‌కి కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో కాలు ప్రాక్చర్ అవ్వడంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బిఆర్‌ఎస్ మండల నాయకులు సాయిని సమ్మయ్య నివాసానికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏంపెల్లి గంగయ్య ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకొని ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఏగమాటి వెంకట్‌రెడ్డి నివాసానికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం స్ధానిక గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం అమారారం గ్రామ పంచాయితీకి చెందిన పాయం పోతురాజు అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు బిజ్జం రమేష్ నివాసానికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News