Monday, April 29, 2024

అభి’జీత్ గయా’

- Advertisement -
- Advertisement -

Abhijit as the winner of Bigg Boss Season-4

 

బిగ్‌బాస్ సీజన్-4 విజేతగా ప్రకటన

బిగ్‌బాస్4 విన్నర్ అభిజిత్

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ లో అభిజిత్ విజేతగా నిలిచాడు. గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు కంటెస్టెంట్లలో చివరికి అభిజిత్, అఖిల్ మిగలగా, నాగార్జున అభిజిత్ చేయిని పైకి లేపి విజేతగా ప్రకటించాడు. అనంతరం అభిజిత్ కు ట్రోఫీ, క్యాష్ చెక్ తో పాటు ఓ ఖరీదైన బైక్ ను కూడా కానుకగా ఇచ్చారు. అఖిల్ రన్నరప్ గా మిగిలాడు. ఈ సందర్భంగా అభిజిత్ మాట్లాడుతూ, తనకు మద్దతు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ వ్యాఖ్యానించాడు. బిగ్ బాస్ కు ధన్యవాదాలు తెలిపాడు. ఈ ప్రస్థానంలో తనకో పాత్ర ఇచ్చారంటూ వ్యాఖ్యానించాడు. ఈ షోలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని వెల్లడించాడు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, బిగ్ బాస్ ఇల్లు వ్యక్తిత్వ వికాసానికి సరైన వేదిక అని అభిప్రాయపడ్డారు. ఎదుటివాళ్లతో ఎలా వ్యవహరించాలి, నేర్చుకున్న పాఠాలతో మనల్ని మనం ఎలా మలుచుకోవాలన్నది బిగ్ బాస్ షో చెబుతుందని అన్నారు.

రూ. 10 లక్షలు తిరస్కరించిన హౌస్‌మేట్స్

బిగ్‌బాస్‌లో ఎలిమినేట్ బాధ్యతను హీరోయిన్లు లక్ష్మీరాయ్, ప్రణీతలకు అప్పగించారు. దీంతో ఆ ఇద్దరు బ్యూటీలు బ్యాండ్‌బాజాలతో ఇంట్లోకి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. మొదటగా ప్రణిత 10 లక్షలు రూపాయలు ఉన్న సూట్‌కేస్‌తో వెళ్లి కంటెస్టెంట్స్‌ను టెంప్ట్‌చేసే ప్రయత్నం చేశారు. రూ.10 లక్షలు తీసుకొని ఎవరైనా వెళ్లొచ్చు అని ఆఫర్‌ఇవ్వగా అందరూ తిరస్కరించారు. సోహెల్ మాత్రం 25లక్షల ఆఫర్‌ను అందిపుచ్చుకుని హౌస్ నుంచి బయటికొచ్చాడు. ఇదిలావుండగా బిగ్‌బాస్ 4 సీజన్‌నుంచి హారిక ఎలిమినేట్‌అయింది. హౌస్‌లోకి వెళ్లిన మెహరిన్, అనిల్‌రావిపుడి కలిసి హారికను ఎలిమినేట్‌చేశారు. మొదటగా హౌస్‌మేట్స్‌అందరికి కళ్లకి గంతలు కట్టి ఎలిమినేట్ ప్రాసెస్‌స్టార్ట్‌చేశారు. బిగ్‌బాస్‌ఎలిమినేట్‌అయిన వ్యక్తిని బయ టకు తీసుకొచ్చే బాధ్యతను యంగ్‌డైరెక్టర్‌అనిల్‌రావిపుడికి అప్పగించారు. అయితే నేను నవ్విస్తాను కానీ ఎలిమినేట్‌చేయలేనని నాగ్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో మెహరిన్‌కు ఆ బాధ్యతను అప్పగించారు. గంగవ్వ అయితే ఇంటికొచ్చే వాళ్లతో ఫొటోలు దిగలేకపోతున్నానని వచ్చిన వాళ్లు వారి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో తనతో తెగ మాట్లాడిస్తున్నారని చెప్పారు. ఇల్లు కట్టిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News