Saturday, April 27, 2024

ఎసిబి చిక్కిన కందుకూరు ఎంపిఓ, రాచులూరు పంచాయితీ కార్యదర్శి

- Advertisement -
- Advertisement -

కందుకూరు ః రాష్ట్రంలో ఇటీవల ఏసిబి అధికారులు నిర్వహిస్తున్న వరుస దాడుల్లో పలువురు అధికారులు చిక్కుతున్నారు. గత నెల రోజుల వ్యవధిలో 08 మంది అధికారులు అవినీతి శాఖ అధికారులు చేతికి దొరికారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల ఎంపీఓ కళ్యాణి, రాచులూరు పంచాయతీ సెక్రటరీ నరేందర్ లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడారు. రెడిమిక్స్ కంపెనీ హెచ్‌ఎండిఎ అనుమతుల పేరుతో రూ. 5 లక్షలు డిమాండ్ చేసి ఎసిబి అధికారుల వలలో చిక్కారు. ఎసిబి డిసిపి కె. భద్రయ్య మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం నగరానికి చెందిన మధుసూదన్‌రెడ్డి మండలంలోని రాచులూరు రెవెన్యూ పరిధిలోని 2020 వ సంవత్సరంలో వైష్ణవి కన్‌స్ట్రక్షన్ పేరుతో ఓ రెడిమిక్స్ కంపెనీని ఏర్పాటు చేసుకున్నాడు. పోల్యూషన్ బోర్డ్, విద్యుత్ శాఖల నుండి అనుమతులు తీసుకోని పనులు నిర్వహిస్తుండగా 2 నెలల క్రితం కందుకూరు ఎంపిఓ కళ్యాణి ఆదేశాసుసారం రాచులూరు పంచాయితీ కార్యదర్శి డెరంగుల నరేందర్ వైష్ణవి కన్‌స్ట్రక్షన్ కంపెనీకి హెచ్‌ఎండిఎ అనుమతులు లేవంటూ నోటిసులు అందించారు.

దీంతో మధుసూదన్‌రెడ్డి హెచ్‌ఎండిఎ అనుమతులు ఎందుకని ప్రశ్నించిన ఖచ్చితంగా అనుమతు కావాలని లేకుంటే కంపెనీని మూసివేస్తామని బెదిరించడంతో రూ. 5 లక్షలు ఇవ్వడానికి అంగికరించిన అనంతరం ఎసిబి అధికారులను ఆశ్రయించి ఇరువురిపై ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం ఎసిబి అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ఒక బృందం రాచులూరు గ్రామంలో , రెండు బృందాలు కందుకూరు ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఉండగా వైష్ణవి కన్‌స్ట్రక్షన్ రెడిమిక్స్ వద్ద పంచాయితీ కార్యదర్శి నరేందర్‌కు రూ. 2. 50 లక్షలు మధుసూదన్‌రెడ్డి ఇస్తుండగా ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. పంచాయితీ కార్యాలయం వద్దకు తీసుకోచ్చి విచారించగా డబ్బులు తనతో పాటు ఎంపిఓ కళ్యాణికి రెడిమిక్స్ కంపెనీ వారు ఇచ్చారని చెప్పడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎంపిఓ కళ్యాణి, పంచాయితీ కార్యదర్శి నరేందర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎసిబి ఇన్‌స్పెక్టర్లు ప్రశాంత్, సతీష్, నరేష్‌కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News