Monday, April 29, 2024

పరువు హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః తన సోదరి మతాంతర ప్రేమ వివాహం చేసుకుందని ఆగ్రహం చెందిన యువకుడు చెల్లి భర్తను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు జడ్జి ఎండి అఫ్రోజ్ అక్తర్ శుక్రవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం… బిల్లిపురం నాగరాజు మార్కెటింగ్ ఉద్యోగం చేసేవారు. ఈ క్రమంలోనే తనకు పరిచయమైన బాలానగర్‌కు చెందిన అష్రీన్ సుల్తానాను నాగరాజు ప్రేమించాడు.

ఇద్దరు ఐదేళ్లు ప్రేమించుకున్న తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం యువతి హిందూ మతంలోకి మారింది. వీరిపై వివాహంపై కోపం పెంచుకున్న యువతి సోదరుడు నాగరాజును చంపేందుకు పలుమార్లు ప్రయత్నం చేయడంతో హైదరాబాద్ నుంచి వెళ్లి పోయి మంచిర్యాలలో కొద్ది రోజులు ఉన్నారు. తర్వాత నగరానికి వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ షోరూంలో మళ్లీ ఉద్యోగంలో చేరాడు. తమను యువతి సోదరుడు సయిద్ మొబిన్ అహ్మద్ వెంబడించలేదని భావించారు.

మే4,2022 బైక్‌పై అష్రీన్ సుల్తానా, నాగరాజు వెళ్తుండగా సయింద్ మొబిన్ అహ్మద్, అతడి బావ మహ్మద్ మసూద్ అహ్మద్ కలిసి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న సరూర్‌నగర్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఐఓ శ్రీధర్‌రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్ సీతారాం, ఎస్‌ఐపి శ్రీనివాసులు, ఎఎస్సై ప్రభాకర్ తదితరులు కేసు దర్యాప్తు చేశారు. సాక్షాలను కోర్టులో సమర్పించగా కోర్టు నిందితులను శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News