Sunday, April 28, 2024

పార్క్‌స్థ్ధలంలో సూచిక బోర్డును తొలగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

బాలాపూర్: పార్క్‌స్థ్ధలాన్ని సూచిస్తూ కార్పొరేషన్ సిబ్బంది ఏర్పాటు చేసిన బోర్డుతో పాటు రోడ్డు మార్కింగ్ రాళ్లను అక్రమంగా తొలగించిన ప్రైయివేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ బడంగ్‌పేట్ కార్పొరేషన్ కమిషనర్ టి కృష్ణమోహన్‌రెడ్డికి నాదర్‌గుల్ మర్రి లక్ష్మమ్మకాలనీ సంక్షేమ సంఘం సభ్యులు బుధవారం వినతి పత్రం అందజేశారు. గత నెల 19వ తేదీన తమ కాలనీకి ఉన్న 60 ఫీట్లరోడ్డు, పార్క్‌స్థ్ధలం ఆక్రమణకు గురి అవుతున్న సమాచారాన్ని తాము కమీషనర్ దృష్టికి తీసుకురావడంతో ఈనెల 11వ తేదీన పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది రోడ్డు మార్కింగ్ రాళ్లతో పాటు పార్క్ స్థ్ధలంలో సూచిక బోర్డును సైతం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపా రు.

కాగా కనీసం 24 గంటల సమయం కూడా గడవక ముందే తమ కాలనీకి పక్కనే ఉన్న వ్యవసాయ భూమికి సంబంధించిన మర్రి శ్రీధర్‌రెడ్డి, మర్రి భాస్కర్‌రెడ్డి అనే ఇద్దరు ప్రయివేటు వ్యక్తులు రాత్రికి రాత్రే అక్రమంగా సూచికబోర్డు ,రోడ్డు మార్కింగ్ రాళ్లను తొలగించారని తెలిపారు. అదే విధంగా తమతో పాటు కార్పొరేషన్ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ తమపై దాడికి పాల్పడ్డారని, తక్షణం శ్రీధర్ రెడ్డి ,భాస్కర్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోని తమ కాలనీకి చెందిన రోడ్డు, పార్క్ స్థలాన్ని తమకు అప్పగించాలని ఈ సందర్భంగా కమీషనర్‌కు సమర్పించిన వినతి పత్రంలో కాలనీ వాసులు కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కొడపర్తి భాస్కర్, ఉపాధ్యక్షుడు పాలవరపు హరికృష్ణ, ప్ర ధాన కార్యదర్శి కొత్తకోట కుమార స్వామి, కోశాధికారి ఉప్పుల శ్యాం కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News