Monday, April 29, 2024

అక్షయ్ కుమార్‌కు కరోనా

- Advertisement -
- Advertisement -

Actor Akshay Kumar tested positive for COVID-19

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ఆదివారం ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోంఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. ఆదివారం ఉదయం తాను కోవిడ్-19 పాజిటివ్ పరీక్షలు చేయించుకున్నానని వెల్లడించారు. ఈ పరీక్షల్లో తనకు పాజిటివ్ నిర్ధారణ అయిందన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో తాను హోంక్వారంటైన్ లోకి వెళ్లిపోయి, వైద్యుల సూచనల మేరకు చికిత్స చేయించుకుంటున్నట్టు అక్షయ్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా మెలిగినవారు, తనతో కాంటాక్టులో ఉన్నవారు విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ తేలితే చికిత్స చేయించుకోవాలని కోరారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News