Saturday, April 27, 2024

టీకా తీసుకున్న సీరం ఇనిస్టిట్యూట్ సిఇఒ అదర్‌పూనావాలా

- Advertisement -
- Advertisement -

Adar Poonawalla takes covid vaccine

 

న్యూఢిల్లీ: తొలిరోజు టీకా తీసుకున్నవారిలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) సిఇఒ అదర్‌పూనావాలా కూడా ఉన్నారు. తాను టీకా తీసుకున్న వీడియోను పూనావాలా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ చేపట్టిన టీకాల కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని పూనావాలా ట్విట్ చేశారు. ఈ చారిత్రక ఘట్టంలో తమ కంపెనీ తయారు చేసిన కోవీషీల్డ్ భాగాస్వామ్యం పొందడం తమకు గొప్ప గౌరవమని ఆయన పేర్కొన్నారు. తమ టీకా సురక్షితం, సమర్థవంతమని స్పష్టం చేయడానికే ఆరోగ్య కార్యకర్తలతోపాటు తాను కూడా టీకా తీసుకున్నానని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News