Monday, April 29, 2024

అమెరికాకు తాలిబన్ల హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Afghanistan crisis: Taliban warns to America

గడువు ఆగస్టు 31 దాటితే తీవ్ర పరిణామాలు

కాబూల్ : అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణకు నిర్ణయించిన గడువును పొడిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికాకు తాలిబన్లు హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ గతంలో చెప్పిన ఆగస్టు 31 నాటికి ఆ దేశ బలగాల ఉపసంహరణ పూర్తి కావాలని డిమాండ్ చేశారు. అఫ్గానిస్థాన్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడున్న సైన్యాన్ని పూర్తిగా వెనక్కి రప్పించడానికి ఆగస్టు 31 కంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందన్న బైడెన్ వ్యాఖ్యల నేపథ్యంలో తాలిబన్లు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందం ప్రకారం తన బలగాలను అమెరికా పూర్తిగా వెనక్కి రప్పించిన తర్వాతే తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తి కానంతవరకు తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ నుంచి సైన్యం ఉపసంహరణకు నిర్దేశించిన ఆగస్టు 31 గడువును మరింత పొడిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాను తాలిబన్లు హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News