Sunday, April 28, 2024

అగ్రికల్చర్ యూనివర్శీటీ భూములు హైకోర్టుకు కేటాయించడం అన్యాయం: ఎస్‌ఎఫ్‌ఐ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు నిర్మాణానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్శీటీ భూములను 100 ఎకరాలు కేటాయించడం అన్యాయమని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి భవిష్యత్ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు ఈ నిర్ణయం చెంపపెట్టలాంటిదని, యూనివర్శీటీ ముందు ఆందోళనలు చేస్తున్న విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బి.శంకర్‌లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్శీటీని సంప్రదించకుండా యూనివర్శీటీ భూములను హైకోర్టు నిర్మాణానికి అగమేఘలపై నిర్ణయం తీసుకోని జీవో 55 తీసుకుని వచ్చారని దీంతో యూనివర్శీటీలో ఉన్న 400 రకాల వృక్ష జాతులు 80 రకాల పక్షుల జాతులు 350 అరుదైన జాతులు అంతరించి జీవవైవిద్యం నష్టపోయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో నూతన విత్తన అభివృద్ధి, వంగడాలు అభివృద్ధి, వ్యవసాయంలో నూతన సంస్కరణలు అమలుకు వేలాది ఎకరాల భూమి అవసరం అని … భూములను యూనివర్శీటీకి ఉంచి హైకోర్టు కోసం వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు. ప్రభుత్వం జీవో వాపసు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులకు మద్దతుగా ఆందోళనలు ప్రతక్ష్యంగా ఆందోళనలు చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా నాయకులు ఎం.స్టాలిన్, వేణు ప్రకాశ్, యూనివర్శీటీ విద్యార్ధి నాయకులు రాజ్ కుమార్, శ్రీజ, శంకర్, వంశీ, అరవింద్, మధుకర్, శివజ్యోతి, నవీన్, విక్రమ్ రెడ్డి,భానుచందర్, సుబాష్, అజయ్, సురేందర్,తేజ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News