Monday, April 29, 2024

శివార్ల హర్యానా యుపిల నుంచి పొగలు ఇప్పుడు వరదలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీకి పొగ కాలుష్యం , ఇప్పటి వరదల ఉధృతి వెనుక పార్టీల రాజకీయాలు ప్రధాన కారణంగా మారాయి. హర్యానా, యుపిల నుంచి పంటవ్యర్థాలను పెద్ద ఎత్తున కాల్చివేయడంతో తలెత్తే భారీ పరిణామపు పొగలతో ఢిల్లీ వాతావరణం పొగచూరింది. ఇప్పుడు హర్యానా, యుపిల్లోని బిజెపి పాలిత అధికార యంత్రాంగాలు తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టేందుకు యమునా నదికి పోట్లు తెప్పించాయని ఆప్ ప్రభుత్వం ఆరోపించింది. హర్యానాలో హత్నికుండ బ్యారేజ్ నుంచి జలాలను కేవలం ఢిల్లీవైపు మళ్లించారని ఆప్ విమర్శించింది. యమున వరద నీరు వెళ్లకుండా హర్యానా ప్రభుత్వం తూర్పు , పశ్చిమ కాలువలను నిలిపివేయడంతో యమున వరద వెనకకు తన్నుకొచ్చి ఢిల్లీని ముంచెత్తిందని ఆప్ ప్రతినిధి ఒక్కరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News