Monday, April 29, 2024

యవ్వనం నుండి ముసలితనం వరకు…

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉండే యంగ్ హీరోయిన్లలో అలియా భట్ పేరు ముందువరుసలో ఉంటుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో అన్నీ పెద్ద సినిమా ప్రాజెక్టులే ఉండటం విశేషం. మొన్నటి వరకు లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ చిన్నది తను చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్‌ను పక్కా ప్లానింగ్‌తో డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ పూర్తి చేస్తోందట. ప్రస్తుతం ఆమె రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమ్మడు రాంచరణ్ సరసన సీత పాత్రలో కనిపించనుంది. ఇక ఈ పాత్ర కోసం ఏడాదిన్నరకు పైగా తెలుగు డైలాగ్స్ నేర్చుకుందట. అందుకే షూటింగ్‌లో చకచకా తెలుగు డైలాగ్స్ చెప్పేసిందని తెలిసింది.

అలాగే సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘గంగుభాయి కతీయవాడి’ సినిమాలో ఆమె నటిస్తోంది. ఈ సినిమా అలియా కెరీర్‌లో చాలా స్పెషల్‌గా ఉండబోతుందట. అయితే ముంబయ్‌లోని ఫేమస్ బ్రోతల్‌హౌస్ ఓనర్ గంగుబాయి బయోపిక్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు సంజయ్ భన్సాలీ. ఈ సినిమాలో అలియా… గంగుబాయి యవ్వనం నుండి ముసలితనం వరకు అన్ని వెరియేషన్స్‌లో కనిపిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను డబ్ చేసి తెలుగు ప్రేక్షకులకు కూడా అందించనున్నట్లు తెలిసింది.

Alia Bhatt to star in ‘Gangubai’ Biopic

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News