Monday, May 6, 2024

‘అల్ ఇండియా ఇండస్ట్రీల్ ఎగ్జిబిషన్’ను వాయిదా వేస్తున్నాం

- Advertisement -
- Advertisement -

Minister Etela Rajender

హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా 81వ అల్ ఇండియా ఇండస్ట్రీల్ ఎగ్జిబిషన్ వాయిదా వేస్తున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ ఎగ్జిబిషన్ జనవరి 1 నుండి ఫిబ్రవరి 14 వరకు జరిగేదని.. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎగ్జిబిషన్ ను మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తాంమనేది త్వరలో తెలియజేస్తామని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం నిబంధనలు జనవరి 31 వరకు ఉన్నాయని, నిబంధనల మేరకే ఎగ్జిబిషన్ వాయిదా వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో మొదటి వెవ్ కేసులు తగ్గుముఖం పట్టాయని.. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సెకండ్ వెవ్ లేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ మార్పు చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యిందని మంత్రి ఈటెల తెలిపారు.

All India Industrial Exhibition 2021 postponed in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News