Monday, April 29, 2024

నుమాయిష్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

All India Industrial Exhibition (Numaish) begins

 

మన తెలంగాణ/హైదరాబాద్ : అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభం అయ్యింది. 46 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన వస్త్ర, ఆభరణాలు, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, తినుబండారాలు తదితర అనేక మంది వ్యాపారులు తమ స్టాళ్లను ఈ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేశారు. మార్చి 31 వరకు ఈ ప్రదర్శన సాగనుంది. సుమారు 20 ఎకరాల్లో 1,400 స్టాళ్లు కొలువుదీరాయి. జనవరి 1న నుమాయిష్ ప్రారంభమైనప్పటికీ కరోనా కారణంగా ఆ మరుసటి రోజే మూసేశారు. దీంతో స్టాళ్లు ఏర్పాటు చేసుకున్న వివిధ రాష్ట్రాల వ్యాపారులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు.

పరిస్థితులు మెరుగవ్వడంతో శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభించారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను ఎగ్జిబిషన్ సొ సైటీ పూర్తి చేసింది. కశ్మీర్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బంగా తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ప్రదర్శనలో తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకున్నారు. నుమాయి ష్ ప్రారంభమవుతుండడంతో ఆయా స్టాళ్ల నిర్వాహకులు, సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగనుంది.

కొవిడ్ నిబంధనలు తప్పనిసరి..

ప్రదర్శనకు వచ్చే సందర్శకులు కొవిడ్ నిబంధనలకనుగుణంగా వి ధిగా మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ఎగ్జిబిషన్ సొసైటీ సూచించింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్టాళ్ల నిర్వాహకులందరూ తమ దుకాణాల్లో విధిగా అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సొసైటీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం స్టాళ్ల మధ్య దూరం పెంచడంతో పాటు రోడ్లు కూడా వెడల్పు చేసినట్టు సొసైటీ వర్గాలు తెలిపాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News