Monday, April 29, 2024

ఉచిత వైద్య పరీక్షలు: ఈటెల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. లాలాపేటలో మినీ డయాగ్నొస్టిక్ హబ్‌ను మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎక్స్ రే, ఇసిజి, అల్ట్రాసౌండ్, సీటి స్కానింగ్‌తో పాటు 108 రకాల ఆరోగ్య పరీక్షలను మినీ డయాగ్నొస్టిక్‌లో చేస్తారు. ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయడమే లక్షమన్నారు. త్వరలోనే మరో 16 డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, గాంధీ ఆస్పత్రిలో రూ.35 కోట్లతో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బస్తీ దవాఖానల్లో పేదలకు ఉచిత వైద్య పరీక్షల కోసమే ఈ డయాగ్నొస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పేదలు వేలాది రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదని, పేదలకు అందుబాటులో ఉండేలా ఉచిత వైద్య పరీక్షల కోసం మరో 8 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News