Monday, April 29, 2024

తెలుగు అమ్మాయిలకు స్పూర్తి.. వైష్ణవి చైతన్యపై అల్లు అర్జున్ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్యపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. ఇటీవల విడుదల సంచలన విజయం సాధించిన బేబి మూవీని చూసిన బన్ని.. చిత్రయూనిట్ ను అభినందించేందుకు గురువారం సాయంత్రం స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా బన్ని మాట్లాడుతూ.. యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు. “లవ్ లో ఉన్న పెయిన్ ను చూపిస్తూ సినిమాలు తీయడం చాలా కష్టమైన విషయం. అలాంటి సినిమాను అద్భుతంగా తీసిన దర్శకుడు సాయి రాజేశ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు అమ్మాయిని పెట్టి ఇలాంటి మూవీని తీసిన సాయి రాజేశ్ గట్స్ బాగా నచ్చాయి. నేను ఈ ఈవెంటుకు రావడానికి మఖ్య కారణం వైష్ణవినే. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో వైష్ణవి నా సిస్టర్ రోల్ చేసింది. ఇలాంటి తెలుగు అమ్మాయిలను హీరోయిన్ గా పెట్టి సినిమాలు చేసే రోజులు ఎప్పుడు వస్తాయా అని ఆ రోజున అనుకున్నాను.

ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎదైనా అవార్డు ఫంక్షన్ కు వెళితే.. తమిళ్, మలయాళం, కన్నడ అమ్మాయిలు వచ్చి అవార్డు అందుకుని వారి భాషలో ధన్యవాదాలు చెబుతున్నారు. అప్పుడు మన తెలుగు అమ్మాయి ఒక్కరు కూడా లేరని చాలా బాధపడ్డా. ఈమధ్య వైష్ణవి క్లిప్ ఒకటి చూశా. తెలంగాణ యాస చాలా బాగా మాట్టాడింది. ఈ సినిమాలో వైష్ణవి తన యాక్టింగ్ తో అదరగొట్టింది. ఈ సంవత్సరం బెస్ట్ హీరోయిన్ గా అవార్డు అందుకోవడం ఖాయం. ఇక నుంచి తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నాను. వైష్ణవి ఇక నుంచి ఎంతో మంది తెలుగు అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది” అని అల్లు అర్జున్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News