Saturday, April 27, 2024

అమెరికాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు…

- Advertisement -
- Advertisement -

America elections update in Telugu

న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. 270 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే వారే అధ్యక్ష పదవిలో ఉంటారు. ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాలే కీలక పాత్ర వహిస్తాయి. ఈ ఎన్నికలలో అమెరికా అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ట్రంప్‌కు 92, బిడెన్ 122 ఎలక్టోరల్ ఓట్లు పడ్డాయి. కెంటకీ, వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా, ఓక్లాహోమా, ఇండియానా, మిస్సిసిపి, టెన్నెసీ, అలబామా, అర్కన్సాస్‌లో టంప్ విజయం సాధించగా వెర్మాంట్, వర్జీనియా, కనెక్టికట్, డెలావర్, ఇల్లినాయిస్, న్యూయార్క్, మేరీలాండ్, మస్సాచుసెట్స్, న్యూజెర్సీ, రోడ్ ఐలాండ్‌లో బైడెన్ గెలుపొందారు. నార్త్ కరోలినా, ఓహియో, పెన్సిల్వానియా, టెక్సాస్, న్యూహాంప్‌షైర్‌లో బైడెన్ ముందంజలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News