Monday, April 29, 2024

విషమే.. విషయాల్లేవ్

- Advertisement -
- Advertisement -

బిజెపి జాతీయ కార్యవర్గంలో అదే ప్రధాన అజెండా: మంత్రి హరీశ్

నీళ్లు, నిధులు, నియామకాలపై నిజాలు చెప్పలేక అమిత్ షా అభాసుపాలు
డబుల్ ఇంజిన్ కన్నా సింగిల్ ఇంజిన్‌తోనే అధిక ప్రగతి
తెలంగాణతో పోలిస్తే యూపీ తలసరి ఆదాయం 3రెట్లు తక్కువ

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపికి అధికార యావ సిఎం కెసిఆర్ నామస్మరణ తప్ప మరేది కనిపించ డం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో ఆ పార్టీ రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ కార్యవ ర్గ సమావేశాలలో ఇదే ప్రధాన ఎజెండాగా కనిపించిందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న ఒక జాతీయ పా ర్టీ నిర్వహిస్తున్న కార్యవర్గ సమావేశాలు అంటే దేశానికి, రాష్ట్రానికి సరికొత్త దశా…దిశ నిర్దేశం చేస్తారని అం తా భావించారన్నారు. కానీ ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలిందన్నారు. ఎప్పటిలాగే సిఎం కెసిఆర్, తెలంగాణపైనా విషం చిమ్మడానికే జాతీయ కార్యవ ర్గ సమావేశాలను ఉపయోగించుకోవ డం సిగ్గుచేటని విమర్శించారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో మంత్రి హరీశ్‌రావు మా ట్లాడుతూ, ప్రధాని మోడీ, హోం అమిత్‌షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి మాట్లాడే సత్తాలేక అసత్య, అర్ధసత్యాలు ప్రచా రం చేశారని విమర్శించారు.

ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రులు, పార్టీ అగ్రనేతలంతా పాల్గొన్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాష్ట్ర విభజన చట్టం హామీల ఊసు లేకపోవడం విచారకరమని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. 18 రాష్ట్రాల సిఎంలు కూడా వచ్చారంటే తెలంగాణ కంటే ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ ఏం చేశారో చెబుతారనుకున్నామన్నారు. కానీ బిజెపి దగ్గర విషం తప్ప విషయం లేదని మరోసారి రుజువైందన్నారు. బహిరంగ సభలో అమిత్‌షా…. నీళ్లువచ్చాయా?నిధులువచ్చాయా?నియామకాలు వచ్చాయా? అని ఒకటికి మూడుసార్లు అరిగిన గ్రామ్‌ఫోన్ రికార్డు లెక్క ఒక్కటే అడిగారన్నారు. నీళ్లు వచ్చింది నిజం,నిధులు వచ్చింది నిజం, నియామకాలు జరిగింది నిజన్నారు. నీళ్ల గురించి తెలుసుకోవాలంటే ఉమ్మడి పాలమూరు, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాకు జిల్లాకు వెళ్ళి చూడాలని సూచించారు. ఎక్కడికి ఎక్కడికి వెళి ్లచూసినా కాళేశ్వరం ఫలితాలు కళ్లముందు కనిపిస్తాయన్నారు. నీళ్లు, నిధులు నియామకాలు వచ్చాయా? అని రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు.

ఏ జిల్లాకు అయినా వెళదాం పదండి….! నీళ్లు ఎలా వచ్చాయో తెలుస్తుందన్నారు. తనతో పాటు వస్తే నీళ్లు ఎలా వచ్చాయో చూపిస్తానని అమిత్ షాకు సవాల్ విసిరారు. నీళ్లు రాక పోతే ప్రధాని మోడీ లక్ష కోట్ల రూపాయల విలువైన ధాన్యం తెలంగాణ నుంచి ఎలా కొన్నామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పంజాబ్ తర్వాత దేశంలో అత్యధిక ధాన్యం పండించింది తెలంగాణే అని నీతి ఆయోగ్ లెక్కలు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. 2కోట్ల 60 లక్షల టన్నుల ధాన్యం నీళ్లు రాక పోతే ఎలా పండుతుందని సూటిగా ప్రశ్నించారు. ఇలా ప్రతి విషయంలో నిజాలు చెప్పలేక అమిత్ షా అభాసు పాలయ్యారన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి అమిత్ షా తన వ్యాఖ్యలతో తెలంగాణ రైతులను అవమానించారన్నారు. యూపి తలసరి ఆదాయం తెలంగాణ కన్నా మూడు రెట్లు తక్కువ అని అన్నారు. రాష్ట్రంలో సింగిల్ ఇంజిన్ సర్కార్ ఉన్నా…. డబుల్ ఇంజిన్ సర్కార్ కంటే ఎక్కువ ప్రగతిని సాధిస్తోందన్నారు.

దేశంలో కంటే….రాష్ట్రంలోనే వ్యవసాయ వృద్ధిరేటు ఎక్కువ

రాష్ట్రంలో వ్యవసాయ రంగం గడిచినఏడేళ్లలో 10శాతంవృది ్ధచెందగా…. దేశంలో కేవలం 3 శాతం వృద్ధి మాత్రమే నమోదైందన్నారు. ఈ లెక్కలు నీతి ఆయోగ్ చెప్పిందన్నారు. గతేడాది అయితే ఏకంగా 21శాతంవృద్ధి నమోదుచేసి రికార్డు సృష్టించామన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో వృది ్ధవిషయంలో దేశంలోనే రాష్ట్రంలో అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. ఇదంతా నీళు ్లరాకుండా నేసాధ్యమైందా? అని ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ విప్లవాత్మకమైన విధానాలు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశాయన్నారు.

నిధుల గురించి తెలుసుకోవాలంటే…

నిధుల విషయంలో రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు అమిత్‌షాకు లేదని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి…దేశానికే రోల్‌మోడల్ అని అన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయన్నారు. తలసరిఆదాయం విషయంలో తెలంగాణ 2014..20-15లో రూ. 1.24 లక్షలు ఉంటే గత ఆర్ధిక సంవత్సరం నాటికి రూ. 2.78 లక్షలకు చేరుకుందన్నారు. అదే సమయంలో దేశ తలసరిఆదాయం 2014-..2015లో రూ.86వేలకు పైగా గత ఆర్ధిక సంవ్సరం నాటికి రూ.1.49 లక్షల మేరకు నమోదైందన్నారు. నిధులు సాధించడం వల్లే ఈ వృద్ధిని సాధించగలిగామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంపద పెంచింది….ప్రజలకు పంచిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరాఫించన్లు, కళ్యాణలక్ష్మీ, కెసిఆర్ కిట్లు…. ఇలా అనేక పథకాల రూపంలో ప్రజల ఇళ్లకు నిధులు చేరుతున్నాయన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కోసం రూ. 24వేల కోట్లు ఇవ్వాలని నీతిఅయోగ్ చెప్పిందన్నారు. అలాగే 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ. 1,129 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ. 817 కోట్లు, 15వ ఆర్థిక సంఘం రూ. 6వేల కోట్లకు పైగా రావాలన్నారు. వీటితో పాటు వెనుకబడ ్డప్రాంతాల అభివృది ్ధగ్రాంట్ల కింద రూ. 1,350 కోట్లు, జిఎస్‌టి పరిహారం రూ. 2,248 కోట్లు రావాలన్నారు. ఆ నిధులు ఎప్పుడు ఇస్తారో ముందు చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

ఇక నియామకాల విషయంలో…

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తమన్న కేంద్రం…. 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? ఇస్తే వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2.5లక్షల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దమొత్తంలో నియామకాలు చేపట్టామన్నారు. లక్షా 50వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వగా లక్షా 35వేలపోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందన్నారు.. ప్రస్తుతం మరో 91వేల పోస్టుల భరీ ్తప్రక్రియను యుద్ధ ప్రాతిపాదికన జరపుతున్నామన్నారు. మరి కేంద్రం వద్ద ఖాళీగాఉన్న పదహారున్నర లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారో అమిత్‌షా సమాధానం చెప్పాలన్నారు.

మోడీ అర్ధ సత్యాలు చెప్పారు

నరేంద్రమోడీ అర్ధ సత్యాలు చెబుతుంటారని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కేంద్రమే పది కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పది కిలోల బియ్యం పథకం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 4,246 కోట్లు ఖర్చుచేస్తున్నదన్నారు. అలాంటప్పుడు మాడబ్బులు….మాకిచ్చి కేంద్రమే అందరికి ఇస్తుందని చెప్పాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ విషయంలో కూడా అదేమాట చెప్పారన్నారు.

ఆరోగ్యశ్రీ కింద వైద్యం 87లక్షల కుటుంబాలకు వర్తిస్తే…. ఆయుష్మాన్ భారత్ కింద కేవలం 20 లక్షల కుటుంబాలకే వర్తిస్తోందన్నారు. దీనిపై కేంద్రం రూ. 170 కోట్లు ఖర్చు చేస్తే….ఆరోగ్య శ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 980 కోట్లు వెచ్చించిందన్నారు.

కాళేశ్వరం గొప్పతనం బిజెపికి అర్ధం కాదు

కాళేశ్వరం గొప్పతనం బిజెపికి ఎప్పటికి అర్ధం కాదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎనీటైం మీటర్ (మనీ) అనుకునే మీకు….. ఎనీటైం వాటరన్న విషయం తెలియదని మండిపడ్డారు. పైగా ఆ ప్రాజెక్టుకు అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుకు రూ. 80వేల కోట్ల అనుమతులు ఇచ్చింది కేంద్రం కాదా? అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని పార్లమెంట్‌లో కేంద్రం చెప్పింది వాస్తవం కాదా? నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News