Saturday, April 27, 2024

రైతాంగం డిమాండ్లపై మరోసారి దీక్ష చేపడ్తానని అన్నాహజారే హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Anna Hazare warns Centre of fast over Farmers demands

 

పూణె: రైతాంగం డిమాండ్లపై మరోసారి నిరాహారదీక్ష చేపడ్తానని సామాజిక కార్యకర్త అన్నాహజారే హెచ్చరించారు. ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని హజారే విమర్శించారు. వ్యవసాయ పంటల ఖర్చులు, ధరలపై ఏర్పాటు చేసే కమిషన్(సిఎసిపి)కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలన్న మరో డిమాండ్‌ను కూడా ఆయన గుర్తు చేశారు. తన డిమాండ్లపై ఆయన కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్‌తోమర్‌కు లేఖ రాశారు. రైతాంగం డిమాండ్లపై గతేడాది ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని రాలేగాంసిద్ధిలో అన్నాహజారే నిరాహార దీక్ష చేపట్టారు. అప్పటి వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్ నుంచి రాతపూర్వక హామీతో ఫిబ్రవరి 5న దీక్ష విరమించారు. ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి 2019 అక్టోబర్ 30 వరకల్లా నివేదిక ఇచ్చేలా ఆదేశిస్తామని రాధామోహన్‌సింగ్ రాసిన లెటర్ కాపీలను హజారే మీడియాకు అందించారు. ఈ నెల 8న రైతు సంఘాలిచ్చిన భారత్ బంద్‌కు మద్దతుగా అన్నాహజారే ఆ రోజున ఒకరోజు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News