Thursday, May 9, 2024

అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ సరఫరా ప్రారంభం

- Advertisement -
- Advertisement -

అమెరికాలో లక్షలాది మంది అపేక్షగా ఫైజర్ వ్యాక్సిన్ సరఫరా ప్రారంభం
న్యూయార్క్ లోని ఐసియు నర్సుకు అందిన మొదటి టీకా డోసు

వాషింగ్టన్: అమెరికాలో ఇప్పటివరకు దాదాపు మూడు లక్షల మంది ప్రాణాలను బలిగొన్న విపత్కాలంలో కరోనా మహమ్మారిని మట్టుబెట్టే ఫైజర్ వ్యాక్సిన్ సోమవారం చేరుకోవడం చారిత్రక ఘట్టానికి నాంది అని చెప్పవచ్చు. భారీ ఎత్తున సాగనున్న ఈ ఫైజర్ టీకా పంపిణీ కార్యక్రమంలో మొట్టమొదటి టీకా డోసు న్యూయార్క్ లోని ఇంటెన్సివ్ కేర్ నర్సుకు సోమవారం ఇచ్చారు. న్యూయార్క్ గవర్నర్ యాండ్రూ క్యూమో సమక్షంలో క్వీన్స్ లోని లాంగ్ ఐలాండ్ జ్యూయిష్ మెడికల్ సెంటర్ కు చెందిన నర్సు శాండ్రా లిండ్సే సోమవారం ఉదయం 9.30 గంటలకు ముందుగానే టీకా తీసుకున్నారు. ఇతర వ్యాక్సిన్ల మాదిరిగా ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు తానెలాంటి ఇబ్బంది పడలేదని, తనకు బాగా ఊరట కలిగిందని ఆమె తన అనుభూతిని వ్యక్తం చేశారు. సరైన వైద్యం ఇప్పుడు ప్రారంభమైందన్న భావం కలుగుతోందని ఆమె తెలిపారు. చరిత్రలో అత్యంత బాధాకరమైన ఘట్టం అంతమొందడానికి ఇది ప్రారంభం అని ఆమె పేర్కొన్నారు. చీకటి సొరంగం చివరన ఇది ఒక వెలుగుగా గవర్నర్ క్యూమో అభివర్ణించారు. ఐసియు నర్సు తొలి టీకా డోసు తీసుకున్న వెంటనే అధ్యక్షుడు ట్రంప్ కంగ్రాచ్యులేషన్స్ అమెరికా, కంగ్రాచ్యులేషన్స్ వరల్డ్ అని ట్వీట్ చేశారు.

ఈ రోజు ఉదయం నౌకల ద్వారా గడ్డకట్టిన వ్యాక్సిన్ డోసులు అమెరికాకు చేరాయి. దేశం మొత్తం మీద ఆస్పత్రులకు చేరుతున్నాయి. హెల్త్‌కేర్ వర్కర్లకు, నర్సింగ్‌హోమ్ రెసిడెంట్స్‌కు ఇవి ఇవ్వడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫైజర్ సిఇఒ ఆల్బెర్ట్ బౌర్లా ఫైజర్ వ్యాక్సిన్ అందుకుంటున్న మొదటివారిలో తానూ ఉన్నానని చెప్పారు. సిఇఒ టీకా తీసుకుంటే ప్రజల్లో టీకాపై మరింత నమ్మకం పెరుగుతుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా అందిస్తున్న్రారు. శ్వేత సౌథం లోని ఉన్నతాధికారులకు, కూడా ముందుగా వ్యాక్సిన్ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షడు మైకే పెన్స్‌కు, సన్నిహితంగా ఉండే సిబ్బందికి, ప్రథమ పౌరురాలు మెలనియా సహా శ్వేత సౌధం లోని అనేక మంది ఉన్నతాధికారలుకు మొదట వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ట్రంప్, మెలనియా, పలువురు ఉన్నతాధికారులు కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. వైట్‌హౌస్‌లో మరికొన్ని కేసులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్యలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. మిషిగన్ లోని ఫైజర్ భారీ కర్మాగారం నుంచి ఫెడెక్స్ ట్రక్కులు ఆదివారం 636 ప్రాంతాలకు బయల్దేరాయి. ఇవి 145 టీకా సరఫరా కేంద్రాలకు వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి. మొదటి విడతలో అమెరికా వ్యాప్తంగా 30 లక్షల డోసులను పంపిణీ చేయనున్నారు. వీటిని ఆస్పత్రుల్లో క్లిటికల్ కేర్ యూనిట్లలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి, నర్సింగ్ హోమ్‌ల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్నారు. మళ్లీ మూడు వారాల తరువాత వీరందరికీ రెండో డోసు సరఫరా చేస్తారు.

Pfizer Vaccine drive started in US

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News