Monday, April 29, 2024

సరికొత్త రికార్డు సృష్టించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

Another record for Prime Minister Narendra Modi

న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక కాలంపాటు పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా నరేంద్ర మోడీ గురువారం సరికొత్త రికార్డు సృష్టించారు. బిజెపి నేత వాజ్ పేయి అన్ని దఫాల్లో కలిపి 2268 రోజులు ప్రధాని పదవిలో ఉండగా, నేడు ప్రధాని మోడీ భారత చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన నాల్గవ ప్రధానమంత్రి అయ్యారు. జవహర్ లాన్ నెహ్రూ 16సంవత్సరాల 286 రోజులు పని చేశారు. అతని కుమారై ఇందిరా గాంధీ 15 సంవత్సరాల 350 రోజులు పాటు పనిచేశారు. మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల 4రోజులు పనిచేశారు. వీరు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. భారత 14వ ప్రధానిగా మోడీ మే 26, 2014 న ప్రమాణ స్వీకారం చేశారు. తిరిగి రెండోసారి ప్రధానిగా మే 30, 2019 న ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రెండో రికార్డును కూడా ప్రధాని సొంతం చేసుకున్నారు. ఆగస్టు 15న ప్రధాని హోదాలో ఎర్రకోటపై నుంచి జాతీయ జెండాను ఎక్కువ సార్లు ఎగుర వేసిన ప్రధానుల జాబితాలో నరేంద్ర మోడీ నాలుగో స్థానంలో ఉన్నారు.

Another record for Prime Minister Narendra Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News