Friday, April 26, 2024

ఖాకీలను వెంటాడుతున్న కరోనా

- Advertisement -
- Advertisement -

Anxiety in the police with Corona

 

వరుసగా వైరస్ బారినపడుతున్నారు
తాజాగా బాలాపూర్ డిఐకి పాజిటివ్
ముందుండి పోరాడుతున్న పోలీసులు
ఫొటోః దయా పేరుతో ఉంది

మనతెలంగాణ, హైదరాబాద్ : పోలీసులు వరుసగా కరోనా బారినపడుతుండడంతో లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. నగరంలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి పోలీసులు ఎవరూ బయటికి రాకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇరవై నాలుగు గంటలు పోలీసులు షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు కరోనా బారినపడుతున్నారు. వారి రక్షణ కోసం పోలీస్ కమిషనర్లు పలు చర్యలు తీసుకుంటున్నా కొందరికి పాజిటివ్ వస్తోంది. మరింత అప్రమత్తంగా ఉండాలని సిపిలు కోరుతున్నారు. మొదట్లో పోలీసులకు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారికి వచ్చింది వారితో కుటుంబ సభ్యులు కూడా పాజిటివ్‌గా వచ్చింది. ఇందులో సైఫాబాద్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్, అతడి కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే సైఫాబాద్‌కు చెందిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు కూడా వచ్చింది.

మేడిపల్లిలో విధులు నిర్వర్తిస్ను కానినస్టేబుల్‌కు పాజిటవ్ వచ్చింది, అలాగే గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్‌కు పాజిటివ్ రావడంతో వెంటనే ఆస్పత్రిలో చికిత్స చేయించారు. వీటితో పాటు నగరంలో లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న వారిలో మొదటి సారిగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు కరోనా బారిన పడ్డారు. వీరికి ఎలాంటి లింక్‌లు లేవు, లాక్‌డౌన్ సమయంలో వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో పాజిటివ్ ఉన్న వ్యక్తి ద్వారా సోకింది. అప్పటి నుంచి పోలీసుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. వెంటనే రక్షణ చర్యలు ఎక్కువగా తీసుకోవడం జరిగింది. అయినా కూడా కుల్సుంపుర పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ దయాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో గురువారం మృతిచెందాడు. ఇది గడిచి ఒక్కరోజు కూడా కాకముందే బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న డిఐకి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు.

సడలింపుతో…

లాక్‌డౌన్ నిబంధనలు దశల వారీగా సడలిస్తుండడంతో పోలీసులకు మరింత ముప్పు పొంచి ఉంది. వాహనదారులు రోడ్లపైకి వస్తుండడంతో వారిని నియంత్రించే క్రమంలో చాలామంది పోలీసులు కరోనా బారిన పడే అవకాశం ఉంది. పోలీసులు మరిన్ని రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల రక్షణ కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల సిపిలు చర్యలు తీసుకుంటున్నారు. వారికి డ్రైఫ్రూట్స్, డి, సి విటమిన్ ట్యాబ్లెట్లు ఇవ్వడమే కాకుండా రక్షణాత్మక సూట్లు, గ్లౌజులు, సానిటైజర్లు, మాస్కులు అందజేస్తున్నారు. అలాగే ఇంటికి వెళ్లిన తర్వాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఎప్పటి కప్పుడు సూచనలు ఇస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News