Thursday, May 9, 2024

‘అరణ్య’ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

‘బాహుబలి’ సినిమా తర్వాత రానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘అరణ్య’. ప్రభు సాలొమోన్ దర్శకత్వంలో త్రిభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ బాషలలో ఒకేసారి విడుదల కానుంది. అయితే గత ఏడాది ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంలో విష్ణువిశాల్, పులకిత్ సామ్రాట్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రియా పిల్గావోంకర్, జోయా హుస్సేన్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఈరోస్ ఇంటర్నేషనల్ వారు నిర్మిస్తుండటం విశేషం. త్వరలోనే ‘అరణ్య’ సినిమా నుండి టీజర్స్, సాంగ్స్ విడుదల చేయనున్నారు దర్శకనిర్మాతలు.

ARANYA Movie to Release on March 26

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News