Monday, April 29, 2024

కశ్మీర్‌లో పాక్ ఉగ్రవాదిని పట్టుకున్న ఆర్మీ

- Advertisement -
- Advertisement -

Army captured Pakistani terrorist

మరో ఉగ్రవాది కాల్చివేత
నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాల వద్ద కదలికలు పెరిగాయి: ఆర్మీ మేజర్

శ్రీనగర్: భారత భద్రతా దళాలు కశ్మీర్‌లో 19 ఏళ్ల లష్కరే తోయిబా ఉగ్రవాదిని పట్టుకున్నాయి. ఉరి వద్ద నియంత్రణ రేఖ వెంబడి జరిపిన ప్రత్యేక ఆపరేషన్‌లో మరో ఉగ్రవాదిని హతమార్చారు. పట్టుబడిన ఉగ్రవాది పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాడు. తన పేరు బాబర్ పాత్రా అని అతడు చెప్పినట్లు మేజర్ వీరేంద్ర వెల్లడించారు. తాను లష్కరే తోయిబా ఉగ్రవాదినని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో తనకు శిక్షణ ఇచ్చారని విచారణలో అతను వెల్లడించాడు. గత ఏడు రోజుల్లో ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు భద్రతాదళాలు వెల్లడించాయి. పాకిస్థాన్ ఆర్మీ సాయం లేకుండా సరిహద్దుల్లో ఇంతమంది ఉగ్రవాదుల కదలికలు అసాధ్యమని, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న అన్ని ఉగ్రవాద స్థావరాల్లో కదలికలున్నాయని మేజర్ వీరేంద్ర చెప్పారు. గత ఫిబ్రవరిలో పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం విరమణ తర్వాత నియంత్రణ రేఖ వెంబడి భారత భద్రతా దళాలు జరిపిన మేజర్ ఆపరేషన్ ఇదే. ఈ నెల 18నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఉరి, రాంపూర్ సెక్టార్లలో పలు చోట్లు ఉగ్రవాదులు మన దేశంలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నించగా సైన్యం వాటిని విఫలం చేసింది. గత వారం రాంపూర్ సెక్టార్‌లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో గత మూడు రోజుల్లో నలుగురు జవాన్లు కూడా గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News