Monday, April 29, 2024

డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరిపై అరెస్ట్ వారెంట్

- Advertisement -
- Advertisement -

 

ఖమ్మం:డిసిసిబిడైరెక్టర్,మాజీ ఎంపి పొంగులేటి ముఖ్య అనుచరుడైన తుళ్ళూరి బ్రహ్మయ్య ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.గత ఏడాది నమోదైన ఒక కేసులో అతణ్ణి అరెస్ట్ చేసేందుకు కోర్టు నుంచి అరెస్ట్ వారేంట్ జారీ అయ్యింది.ఆశ్వాపురం మండలానికి చెందిన బ్రహ్మయ్య అక్కడ సోసైటీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు.గత ఏఢాది జూన్ 29న సోసైటీ కార్యాలయంలో బ్రహ్మయ్య ఉండగాఅప్పటి పాల్వంచ కానిస్టేబుల్ పాయం సత్యనారాయణ, మంచికంటి నగర్ కు చెందిన ఉకే సతీష్ ఆధ్వర్యంలో మరో 40మంది చింతిర్యాలకు చెందిన భూ వివాదంపై చర్చించేందుకు వచ్చి బ్రహ్మయ్యపై దాడి చేశారు. అక్కడ ఉన్న కారును కూడా ధ్వంసం చేశారు. బ్రహ్మయ్యను గదిలో బంధించారు.
తననుహత్యను చేయడానికి దాడి చేశారని అప్పట్లో బ్రహ్మ య్య వారిపై అశ్వాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అప్పట్లో ఇరువర్గాల మీద కేసు నమోదు చేశారు.

కానిస్టేబుల్ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్ళూరి బ్రహ్మయ్య తో పాటు మరో 8మంది పై గత ఏడాది జూన్ 20న ఎస్సీ ఎస్టి అట్రాసిటి కేసు ( ఎఫ్ ఐ ఆర్ నెం.105 ) ఆశ్వాపురం పోలీస్ స్టేషన్ లో నమోదు అయ్యింది. సెక్షన్ 148.324.448.294.బి,506ఆర్ డబ్ల్యు149. ఎస్సీ ఎస్టి క్రింద 3(1).3(2) సెక్షన్లను నమోదు చేశారు.ఇటివల ఈ కేసుపై పోలీసులు తమ ఛార్జిషీట్ ను కోర్టుకు దాఖలు చేశా రు.ఈ ఏడాది ఆగస్ట్ 3న ఖమ్మంలో ఎస్సీ ఎస్టి కోర్టులో వా యిదా ఉండగా హజర్ కాలేదు.దీంతో రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసి ఆయన కోసం గాలిస్తున్నారు.

నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేయడంతో ప్రస్తుతం తుళ్ళూరి బ్రహ్మయ్య అజ్ణాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది.ఇటివలనే పొంగులేటికి చెందిన మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్ బాబుపై సి ఐడి పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా తుళ్ళూరి బ్రహ్మయ్య పైఅరెస్ట వారెంట్ జారీ అయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News