Monday, April 29, 2024

ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేం: గులామ్ నబీ ఆజాద్

- Advertisement -
- Advertisement -
Gulam Nabi Azad
అందుకు పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి!

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని 2019 ఆగస్టులో రద్దు చేశారు. దానిని ఇక పునరుద్ధరించలేరని కాంగ్రెస్ నుంచి ఐదు దశాబ్దాల తర్వాత వేరు పడిన గులామ్ నబీ ఆజాద్ ఆదివారం తెలిపారు. ఆయన బారాముల్లాలో ర్యాలీని నిర్వహించి తన బలమెంతో చూయించే ప్రయత్నం చేశారు. ఆర్టికల్ 370 విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించే పార్టీల పన్నాగాలను తాను పారబోనివ్వనని అన్నారు. దానిని పునరుద్ధరించాలంటే పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలన్నారు. మరో 10 రోజుల్లో తన కొత్త పార్టీని ఆరంభించనున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ ఎక్స్‌ప్లాయిటేషన్ కారణంగా 1990 నుంచి లక్ష మంది చనిపోయారని, ఐదు లక్షల మంది పిల్లలు అనాథలయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. తప్పుడు వాగ్దానాలతో, ఎక్స్‌ప్లాయిటేషన్‌తో తాను ఓట్లను అడుగబోనని, ఏదీ సాధ్యమో దానినే మాట్లాడతానని తెలిపారు. ఆయన పరోక్షంగా నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపిలను లక్షంచేసుకుని మాట్లాడారు.
బారాముల్లాలోని డాక్ బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసగిస్తూ ‘నా పేరు లాగే(ఆజాద్) నా కొత్త పార్టీ పేరు, ఆదర్శం, ఆలోచన ఉండగలవు’ అన్నారు. ఆయన ఇదివరలో ప్రసంగించినప్పుడు “నేను ఇంకా నా పార్టీ పేరు నిర్ణయించుకోలేదు. నా పార్టీ పేరు, పార్టీ పతాకం ఎలా ఉండాలనేది జమ్మూకశ్మీర్ ప్రజలే నిర్ణయిస్తారు. నా పార్టీ పేరుకు హిందుస్థానీ పేరు ఉండగలదు. అది అందరికీ అర్థమయ్యేరీతిలో ఉండగలదు’ అన్నారు. రాబోయే వారాల్లో ఆయన పొరగున ఉన్న కుప్వారాలో కూడా ఇలాంటి ర్యాలీలనే నిర్వహించబోతున్నారు. గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీలో చేరేందుకుగాను అల్తాఫ్ హుస్సేన్‌కు చెందిన ‘అప్నీ పార్టీ’కి ఎనిమిది మంది మున్సిపల్ కౌన్సిలర్‌లు రాజీనామా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News