Sunday, April 28, 2024

డిమాండ్లపై రాజీలేదు..పోరే

- Advertisement -
- Advertisement -

దౌసా : తన డిమాండ్లపై తలొగ్గేదే లేదని తగ్గేదే లేదని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ స్పష్టం చేశారు. తనకున్న ప్రధాన బలం తనపై ప్రజలు ఉంచిన నమ్మకం అని ఆదివారం ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లౌట్ వ్యవహారశైలిని పలు దశల్లో ప్రశ్నిస్తూ ఇప్పుడు ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్‌లో ఇప్పుడు సచిన్ అసమ్మతి కాంగ్రెస్ నేత అయ్యారు. తనను నమ్మే ప్రజలకు న్యాయం జరగాల్సి ఉందని, అంతవరకూ తన డిమాండ్ల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. తన తండ్రి దివంగత నేత రాజేశ్ పైలట్ వర్థంతి సందర్భంగా సచిన్ ఇక్కడి గుర్జర్ హాస్టల్‌లో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సచిన్ తన మద్దతుదార్లను ఉద్ధేశించి మాట్లాడారు. ప్రజలకు ఇప్పుడు కాకపోయినా ఆ తరువాత అయినా భారీ స్థాయి న్యాయం జరుగుతుందని చెప్పారు.

డిమాండ్లు నెరవేరే వరకూ తన పోరు ఆగదని స్పష్టం చేశారు. ఇంతకు ముందటి వసుంధరా రాజే సారధ్యపు బిజెపి ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై తాను చేసిన ఆరోపణలపై ఇప్పటికీ సిఎం స్పందించడం లేదని సచిన్ విమర్శిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంతకాలం అయినా అప్పటి అక్రమాలపై దర్యాప్తు ఎందుకు చేపట్టడం లేదని నిలదీస్తున్నారు.అదే విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షా పత్రాల లీక్‌కు సంబంధించి వెంటనే రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను రద్దు చేయాలని, కొత్తగా ఏర్పాటు చేయాలని ఆయన కోరుతున్నారు. ఇటువంటి తన డిమాండ్లపై వెనకకు వెళ్లడం కుదరదని చెప్పిన సచిన్ తన తండ్రి తమ రాజకీయ జీవితంలో అనేక ఒడుదుడుకులు ఎదుర్కొన్నారని, అయితే ఎక్కడా ఆయన తన ఆత్మగౌరవం, ఆదర్శాల విషయంలో రాజీపడలేదన్నారు. ఇదే పంథాలో తాను సాగుతానని తేల్చిచెప్పారు.

వర్తమాన రాజకీయాలలో పలువురు భిన్నమైన ఆలోచనలతో, సిద్ధాంతాలతో ఉండవచ్చునని, అయితే రాజకీయాలలో సమిష్టి ఉద్ధేశాలలో స్పష్టత అవసరం అన్నారు. తండ్రి వర్థంతి సభలో సచిన్ వేరే పార్టీ ప్రకటిస్తారని, తన భవిష్య రాజకీయాలను వెల్లడిస్తారని ప్రచారం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News