Sunday, April 28, 2024

మాల్దీవుల్లో ప్రాసిక్యూటర్ జనరల్ పై హత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం సద్దుమణిగేలా కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ దేశం అల్లర్లతో అట్టుడుకుతోంది. తాజాగా… ప్రతిపక్షం నియమించిన ప్రాసిక్యూటర్ జనరల్ హుస్సేన్ షమీమ్ ను గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో పొడిచి పరారయ్యాడు. ఈ దాడిలో షమీమ్ ఎడమచేతికి గాయమైంది. దేశాధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుపై ప్రతిపక్షాలు పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన తరుణంలోనే ఈ దాడి జరగడం గమనార్హం.

ముయిజ్జు అధికారంలోకి వచ్చినప్పటినుంచీ చైనా అనుకూల వైఖరిని అవలంబిస్తున్నారు. ఆయన ప్రాపకంలో ఉన్న కొందరు మంత్రులు ఇటీవల భారత ప్రధాని మోదీపై విమర్శలు చేయడంతో వివాదం మొదలైంది. ఇండియాకు ముయిజ్జు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అంతటితో ఆగకుండా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News