Thursday, May 9, 2024

మోనార్క్‌గా వస్తున్న బాలయ్య

- Advertisement -
- Advertisement -

Balakrishna new film monark

సీనియర్ స్టార్ బాలకృష్ణ, దర్శకుడు -బోయపాటిల హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం తో బాలయ్య బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకోవడం ఖాయమంటున్నారు. కాగా ఈ మూవీకి ‘మోనార్క్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నారని తెలిసింది. ఈ టైటిల్ డిఫరెంట్‌గా ఉండడంతో పాటు పవర్‌ఫుల్‌గా కూడా ఉండడంతో ఈ టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట. మరి ఈ చిత్రంలో బాల య్య పాత్ర ఏ రేంజ్‌లో ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో బాలకృష్ణ అఘోర పాత్ర కూడా చేస్తుండడం ఆసక్తి పెంచుతున్న మరో అంశం. ఇక ఈ సీనియర్ స్టార్ పుట్టినరోజు కానుకగా ఈనెల 10న విడుదలైన మూవీ టీజర్ విశేష ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా ఆయన లుక్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా… తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News