Monday, April 29, 2024

నడ్డా టీంలో బండి సంజయ్‌కు చోటు..ప్రధాన కార్యదర్శిగా నియామకం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కరీంనగర్ ఎంపి, తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ బిజెఇప జాతీయ ప్రధాన కార్యదర్శిగా శనివారం నియమితులయ్యారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తన కార్యవర్గాన్ని పునర్వవస్థీకరించారు.

బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడిగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్, ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ పస్మంద ముస్లిం తారీఖ్ మన్సూర్ నియమితులయ్యారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఎకె ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని కూడా బిజెపి జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేయనున్నారు.

మొత్తం 13 మందితో కూడిన జాతీయ ఉపాధ్యక్షులను నడ్డా ప్రకటించారు. గతంలో 12 మంది ఉపాధ్యక్షులు ఉన్నారు. తమిళనాడుకు చెందిన పార్టీ ఇన్‌చార్జ్ సిటి రవి, మహరాష్ట్ర ఇన్‌చార్జ్ దిలీప్ సైకియాలను తప్పించి వారి స్థానంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా బండి సంజయ్(తెలంగాణ), రాధామోహన్ అగర్వాల్(ఉత్తర్ ప్రదేశ్)లను నియమించారు.

పార్టీ ఉపాధ్యక్షులుగా ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, రాజస్థాన్ మాజీ సిఎం వసుంధరా రాజె, జార్ఖండ్ మాజీ సిఎం రఘుబర్ దాస్, సౌదన్ సింగ్, బైజయంత్ పాండా, రేఖా వర్మ, డికె అరుణ(తెలంగాణ), ఎం చుబా ఓ(నాగాల్యాండ్), అబ్దుల్లా కుట్టీ(కేరళ) కొనసాగనున్నారు. ఉపాధ్యక్షులుగా కొత్తగా నియమితులైన వారిలో సరోజ్ పాండే(ఛత్తీస్‌గఢ్), లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్(యుపి), లతా ఉసెండి(ఛత్తీస్‌గఢ్), తారీఖ్ మన్సూర్(ప్రస్తుత యుపి ఎంఎల్‌సి) ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్, బెంగాల్ బిజెపి మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, గుజరాత్ ఎంపి భార్తీబెన్ శ్యాల్‌లను పార్టీ ఉపాధ్యక్షులుగా తప్పించారు.

అరుణ్ సింగ్, కైలాష్ విజయవర్గీయ, సుధ్యంత్ గౌతమ్, తుణ్ చుగ్, వినోద్ తావ్డే, సునీల్ బన్సాల్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతారు.

ఆర్‌ఎస్‌ఎస్‌కు, బిజెపికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించేందుకు బిజెపి ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)బిఎల్ సంతోష్, సంయుక్త ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)గా శివ్ ప్రకాశ్ అదే పదవిలో కొనసాగుతారు. పార్టీ కార్యదర్శులుగా 13 మది ఉంటారు. విజయ రహత్‌కర్(మహారాష్ట్ర), సత్యకుమార్(ఆంధ్రప్రదేశ్), అరవింద్ మీనన్(ఢిల్లీ), ఓపి ధ్రువే(మధ్యప్రదేశ్), అనుపం హజ్రా(పశ్చిమ బెంగాల్), అల్కా గుర్జర్(రాజస్థాన్), ఆశా లక్రా(జార్ఖండ్), రీతూరాజ్ సిన్హా(బీహార్), నరేంద్ర సింగ్ రైనా(పంజాబ్) కార్యదర్శులుగా కొనసాగుతారు.

మహారాష్ట్రకు చెందిన దివంగత నాయకుడు గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ ముండే పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. అస్సాం నుంచి కామాఖ్య ప్రసాద్, యుపికి చెందిన రాజ్యసభ సభ్యుడు సురేంద్ర సింగ్ నగర్, కేరళకు చెందిన అనీల్ ఆంటోని పార్టీ కార్యదర్శులుగా నియమితులయ్యారు. కార్యదర్శులుగా తప్పించిన వారిలో వినోద్ సోంకర్, సునీల్ దేవధర్, హరీష్ ద్వివేది ఉన్నారు. సునీల్ దేవధర్ 2014లో నరేంద్ర మోడీకి ప్రచార మేనేజర్‌గా వ్యవహరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News