Saturday, April 27, 2024

భారత్‌ బంద్‌కు బ్యాంక్ ఉద్యోగుల మద్దతు

- Advertisement -
- Advertisement -

Bank employees support tomorrow's Bharat bandh

హైదరాబాద్: రైతు వ్యతిరేక చట్టాల రద్దు డిమాండ్ల సాధనకు రైతు సంఘాల ఐక్యవేదిక రేపు నిర్వహించే భారత్‌బంద్‌కు బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆప్ ఇండియా తెలంగాణ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులు బంద్ విజయవంతం చేయడానికి సహాయ సహకారాలను అందించాలని పిలుపునిచ్చారు.ఈసందర్భంగా ఈసంఘం ప్రధాన కార్యదర్శి పి. వెంకటరామయ్య మాట్లాడుతూ రైతు లేనిది దేశ ప్రజానీకానికి ఆహారభద్రత లేదని, గిట్టుబాటు ధర లభించక, పెట్టిన పెట్టుబడి రాక అన్నదాతలు నష్టపోయారని పేర్కొన్నారు.

అప్పులు తీర్చలేక వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం నిత్యకృత్యమైందన్నారు. వ్యవసాయ రంగంలో కావాల్సిన సంస్కరణలు స్వామినాథన్ కమిటీ సిఫారసులు చేసి 10ఏళ్లు దాటిన ఇప్పటివరకు ప్రభుత్వాలు అమలు చేయడకపోవడం వారి పాలనకు నిదర్శమన్నారు.రైతు వ్యతిరేక చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, కనీస మద్దతు ధరను చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Bank employees support tomorrow’s Bharat bandh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News