Monday, April 29, 2024

బిసి కులాల లెక్కలు సేకరించి అన్ని రంగాల్లో న్యాయం చేస్తాం

- Advertisement -
- Advertisement -

బిసి కులాలన్నింటికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం
బిసి సంఘాల ఆత్మీయ అభినందన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహించి బిసిల జనాభా లెక్కలు సేకరించి వారికి అన్ని రంగాల్లో చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తామని బిసి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో 40 బిసి కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో 26 విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బిసి సంఘాలు, కుల సంఘాలు సంయుక్తంగా రాష్ట్ర సచివాలయంలోని మంత్రి చాంబర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి ఆత్మీయంగా శాలువాతో సత్కరించి మహాత్మ జ్యోతిబాపూలే ప్రతిమను అందజేశారు.

మంత్రితో పాటు బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశంను కూడా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి బిసిల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిసి కులగణన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేయడం ప్రభుత్వనికి బిసిల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా భావిస్తున్నామని అన్నారు. ఇది బిసిల సమగ్ర అభివృద్ధికి కులగణన పునాది ఏర్పాటు చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సమగ్ర కులగణన కోసం మంత్రివర్గం ఆమోదం, అసెంబ్లీలో తీర్మానం, దాని కొనసాగింపుగా జీఓ 26 తీసుకురావడం చాలా అభినందనీయమని అన్నారు. బిసి కులాల కోసం ప్రభుత్వం నూతనంగా 8 కార్పొరేషన్ లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు గతంలో ఉన్న 11 కులాల ఫెడరేషన్లు యధావిధిగా కొనసాగించడంతో పాటు వాటిని కూడా కార్పొరేషన్ లుగా మార్చాలని ఫెడరేషన్లు కార్పొరేషన్లు లేని బీసీ కులాలకు నూతనంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రూ. 150 కోట్లతో ఇంటింటి సర్వే నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో కులాల వారిగా జనాభా లెక్కలు సేకరిస్తామని, బిసిల సామాజిక పురోగతికి కులాల లెక్కల ఆధారం కనుక బిసిలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు అన్ని రంగాలో ్ల దమాశా ప్రకారం కల్పించడానికి కులాల లెక్కలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిసి కులాల లెక్కలు సేకరించడానికి చట్టబద్ధంగా జరగాల్సిన ప్రక్రియను అంతా జరుపుతున్నామని అందులో భాగంగా జిఓ విడుదల చేశామని గుర్తు చేశారు. బిసి కులాల్లోని గతంలో ఉన్న పదకొండు ఫెడరేషన్లను యధావిధిగా కొనసాగిస్తామనీ, వాటిని కూడా కార్పొరేషన్లుగా మార్చె విషయం ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. నూతనంగా 8 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ఇంకా బిసి కులాల్లో కార్పొరేషన్‌లు లేని కులాలకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ నిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి కుల సంఘాల జెఎసి చైర్మన్ కుందారం గణేష్ చారి, కో చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, వివిధ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మా, శేఖర్ సగర, వేముల వెంకటేష్, కోల శ్రీనివాస్, బాలకృష్ణ నాయి, గోష్క యాదిగిరి, జాజుల లింగం గౌడ్, సిద్ధాంతం శ్యామల, గుంటి మహేష్ మేరు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News