Saturday, April 27, 2024

పెంచల్ దాస్ పెన్ను పవర్.. దుమ్ములేపుతున్న ‘శ్రీకారం’ సాంగ్..

- Advertisement -
- Advertisement -

Bhalegundi Baalaa song released from Sreekaram

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కిస్తున్న సినిమాలో శర్వా సరసన ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల శర్వాకు సంబంధించిన ఓ చిన్న వీడియోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ‘వచ్చానంటివో పోతానంటివో వగలమారి బాల..’ అనే లిరికల్ సాంగ్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుండడంతో విడుదలైన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ లో నిలిచింది. ఈ పాటను రాసిన పెంచల్ దాస్ స్వయంగా తనే కంపోజ్ చేసి పాడాడు. దీంతో మరోసారి పెంచల్ దాస్ పెన్ను పవర్ ఏంటో ఈ సాంగ్ తెలుపుతుంది. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Bhalegundi Baalaa song released from Sreekaram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News