Wednesday, May 8, 2024

జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు చైనా నిరాకరణ

- Advertisement -
- Advertisement -

China refuses to Best wishes to Biden

 

బీజింగ్ : అమెరికా అధ్యక్షుడిగా డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు చైనా నిరాకరించింది. బైడెన్ ఎన్నికను అమెరికా చట్టాలకు అనుగుణంగా అధికారికంగా ప్రకటించే వరకూ తాము స్పందించబోమని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వ్యాంగ్‌వెన్‌బిన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంప్రదాయాలను తాము అనుసరిస్తామని ఆయన తెలిపారు. ఆ దేశంతో తమకున్న విభేదాలను సంప్రదింపులు, పరస్పర గౌరవం, సహకారం ద్వారా పరిష్కరించుకోవాలని భావిస్తామని వ్యాంగ్ తెలిపారు. రష్యా, మెక్సికోతోపాటు మరికొన్ని దేశాలు కూడా జో బైడెన్ ఎన్నిక పట్ల ఇంకా అధికారికంగా స్పందించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News