Monday, April 29, 2024

రూ.2 కోట్ల 50 లక్షల అభివృద్ధి పనులకు భూమి పూజ

- Advertisement -
- Advertisement -

ఆత్మకూర్ : రాష్ట్ర ప్రభుత్వం పట్టణ, గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని అందులో భాగంగానే ఆత్మకూర్ మండలంలో 2 కోట్ల 50 లక్షల అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని మున్సిపల్ చైర్‌పర్సన్ గాయత్రి రవి కుమార్ యాదవ్, వైస్ చైర్మెన్ విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మున్సిపల్ కేంద్రంలో ఎస్‌డిఎఫ్ ప్రత్యేక నిధుల నుంచి అవార్డులలో సిసి రోడ్లకు కోటి రూపాయలు, మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా అదనపు గదులకు 50 లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు.

గోపన్‌పేట గ్రామంలో సిసి రోడ్ల కోసం కోటి రూపాయల నిధులు మంజూరైనట్లు తెలిపారు. మంజూరైన నిధులకు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు భూమి పూజ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన పది సంవత్సరాలలోనే పట్టణ, గ్రామాల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలను మంజూరు చేసి ప్రగతి పథంలో నడిపించినట్లు తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో మత రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

బీద, బడుగు వర్గాల సంక్షేమం కోసం దళిత బంధు, బిసి బంధు, మైనార్టీ బంధుతో పాటు తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ నిలిచిపోయాడని తెలిపారు. జరగబోయే భూమి పూజ కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ప్రతి ఒక్కరు విధిగా హాజరుకావాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News